ఎస్ఎల్‌బీసీ ఘటన చాలా దురదృష్టకరమని చాలా బాధకరమని బీఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్‌బీసీ సొరంగంలోనే చిక్కుకుపోయిన 8 మంది క్షేమంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్లుండి ప్రమాదం జరిగిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ నేతల సందర్శనకు వెళ్లారని, పోలీసులు తమను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
అటు ఈ సంఘటనపై జుడీషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గత మూడ్రోజులుగా కార్మికులు సొరంగంలోనే ఉండిపోయారు. వారు బతికి ఉన్నారా..? లేదా జరగరానిది ఏదైనా జరిగిందా? అనే విషయం కూడా ఇంతవరకు తెలియరాలేదు. సహాయక చర్యలు మాత్రం మూడ్రోజులుగా నిర్వరామంగా కొనసాగుతున్నాయి.