పరిశోధనలో భాగంగా ఈ 41 మంది విద్యార్థులనూ తమ ఫోన్లతో మూడు రకాలైన ఫొటోలను తీస్తూ ఉండమని సూచనలు చేశారు. నవ్వుతూ దిగిన సెల్ఫీలు, తమకి నచ్చి, ఇతరులతో పంచుకోవాలనుకునే వస్తువుల ఫొటోలు, ఇతరులు సంతోషపడతారనుకునే సన్నివేశాల ఫొటోలు.. ఇలా మూడు రకాల ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయమని చెప్పారు.