రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు.
Perni Nani
అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారని, ఆ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేదని అన్నారు పేర్ని నాని.
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని, ఎగ్ పఫ్ ల కోసం ఖర్చు చేసిన లెక్కలు, ఆ వివరాలు ఉన్న ఫైళ్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు నాని.
ఏపీలో రోజురోజుకి హింస పెరుగుతోందన్నారు పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు.
పోలీసులను వాడుకుని వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారన్నారు.
సీఎం జగన్ వల్ల ప్రజలెవరూ నష్టపోలేదని, ఆయన విధానాల వల్ల కేవలం పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలకు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు పేర్ని నాని.