Elon Musk

వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతాయో ఆయనే వివాదాల చుట్టూ తిరుగుతాడో కానీ టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటాడు. ప్రస్తుతం గూగుల్ కో-ఫౌండర్ సెర్జీ బ్రిన్ భార్య నికోల్ షనాహన్ తో మస్క్ ఎఫైర్ సాగించాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. మస్క్ ఇప్పటికే తన మాజీ భార్య, ప్రేయసి ద్వారా ఏడుగురు పిల్లలకు తండ్రయ్యాడు. తన కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే షివోన్ జిలిస్ ద్వారా నవంబర్ 2021లో ట్విన్స్‌కు తండ్రైనట్లు బిజినెస్ ఇన్‌సైడర్ అనే పత్రిక బుధవారం కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్, జిలిస్ కలిసి తమ పిల్లల పేర్లను మార్చుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పిల్లల ఇద్దరి […]

కరోనా మహమ్మారి తర్వాత అన్ని కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దాంతో రెండేళ్ళపాటు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడిన చాలా మంది ఆఫీస్ కు రావడానికి ఇష్టపడటం లేదు. కరోనా భయం తగ్గిపోయి కార్యాలయాలన్ని తెరిచుకొని కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ ఆఫీస్ కు వచ్చే వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఈ విషయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కోపమొచ్చింది. తమ ఉద్యోగులందరూ ఆఫీస్ కు రావాల్సిందే […]

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 44 బిలియన్ డాలర్ల(3.3 లక్షల కోట్ల రూపాయల‌ పైగా)) ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లలో ఉన్న స్పామ్ లేదా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన లెక్కలు అందాల్సి ఉందని, ఆ లెక్కలు తేలేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ఆయన తెలిపారు. డైలీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ లేదా నకిలీ వినియోగదారులు 5 శాతం వరకు ఉండొచ్చని ట్విట్టర్ అంచనా […]