భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర రూ.1.86 కోట్లా?
క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర ఎంతుంటుంది? మరీ ప్రీమియం టికెట్ అయితే 40 వేల రూపాయలు.
క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర ఎంతుంటుంది? మరీ ప్రీమియం టికెట్ అయితే 40 వేల రూపాయలు. కార్పొరేట్ బాక్సుల్లో టికెట్ ధర లక్షల్లో ఉంటుంది. కానీ బడా కంపెనీలు కొనుక్కుని కావాల్సినవాళ్లకు ఇచ్చుకుంటాయి. కానీ రాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ప్రీమియం టికెట్ ధర రీసేల్ వెబ్‌సైట్లలో లక్షలు, కోట్లకు ఎగబాకింది. ఓ వెబ్‌సైట్‌లో ఓ టికెట్‌కు చూపించిన హయ్యస్ట్ ప్రైస్ అక్షరాలా కోటీ 86 లక్షల రూపాయలట!
హాట్‌కేకుల్లా అమ్మడుపోయాయి
టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో ఎవర్‌గ్రీన్ రైవల్ పాక్‌తో జూన్ 9న ఇదే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. దీంతో రీసేల్ వెబ్‌సైట్లలో టికెట్ రేట్ లక్షలు, కోట్లు పలుకుతోంది.
లక్షలు దాటి కోట్లకు ఎగబాకింది
స్టబ్ హబ్ అనే రీసేల్ వెబ్‌సైట్‌లో ఇండియా -పాక్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంచిన లోయస్ట్ టికెట్ ధర లక్షా 4వేల రూపాయలు. సీట్ గీక్ అనే మరో వెబ్‌సైట్‌లో అత్యధిక ధర జస్ట్ కోటీ 86 లక్షల రూపాయలు. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఉన్న క్రేజ్‌ను ఈ వెబ్‌సైట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ ఉన్న ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా ఇంత రేటు లేదు కదా అని క్రీడాపండితులు ముక్కున వేలేసుకుంటున్నారు.