ఏడు వికెట్లు కోల్పోయిన కివీస్
అద్భుతమైన బౌలింగ్‌తో రాణించిన సుందర్, అశ్విన్
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 75 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 242 రన్స్ చేసింది. కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) లు నిలకడగా ఆడి హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు . భారత బౌలర్లలో అశ్విన్ 3, వాష్టింగ్టన్ సుందర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొదటి టెస్టులో దూకుడుగా ఆడిన రిచన్ రవీంద్రను పెవిలియన్ దారి పట్టించాడు. మిచెల్ (18) తక్కువ స్కోర్‌కే ఔట్ చేశాడు. ఆ తర్వాత గ్లేన్ ఫిలిప్స్ (9), బ్లండెల్ (3) సుందర్ చేతికే చిక్కారు.
పుణె పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నప్పటికీ బౌలర్లకూ సహకారం లభిస్తున్నది. అద్భతమైన ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన కెప్టెన్ టామ్ లేథమ్, డేవన్ కాన్వే, విల్ యంగ్‌ల వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అశ్విన్ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ (187)ను అశ్విన్ అధిగమించాడు. ప్రస్తుతం అశ్విన్ 188 వికెట్లు ముందున్నాడు. వీరిద్దరి తర్వాత పాట్ కమిన్స్ (175), మిచెల్ స్టార్క్ (147) ఉన్నారు. వీళ్లిద్దరూ ఆసీస్ బౌలర్లే కావడం గమనార్హం.