కోహ్లీ సెంచరీ.. పాక్‌పై భారత్ ఘన విజయం
పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్) సెంచరీతో, శ్రేయస్ అయ్యర్ (56) హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. దీంతో పాక్ నిర్దేశించిన 242 రన్స్ లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ (20) శుభ్‌మన్ గిల్ (46), హార్దిక్ పాండ్య (8), అక్షర్ పటేల్ (3 నాటౌట్) రన్స్ చేశారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2 వికెట్లు, అహ్మద్, ఖుష్‌దిల్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ గెలుపుతో భారత్ దాదాసు సెమీస్ చేరగా... పాక్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి.
కోహ్లీ రికార్డులు
కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అని అభిమానులు ఉత్కంఠ ఎదురు చూస్తున్న క్రమంలో 42.3 ఓవర్‌కు ఫోర్ బాదాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాదు ఈ బౌండరీతోనే భారత్ విజయం సాధించింది. 466 రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ సాధించాడు.ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. 158 క్యాచ్‌లు పట్టి భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అజారుద్దీన్ (156) రికార్డును బద్దలు కొట్టాడు. 287 ఇన్నింగ్స్ వేగంగా 14,000 రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫీట్‌ను సచిన్ 350 ఇన్సింగ్‌లో సాధించాడు. వన్డేల్లో విరాట్‌కు 51వ సెంచరీ కాగా.. ఇంటర్నేషన్ క్రికెట్ (అన్నిఫార్మాట్లో) 82 సెంచరీలు చేశాడు.