Telugu Global
Sports

వన్డేల్లో 14,000 రన్స్‌ పూర్తి చేసిన కోహ్లీ

నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ

వన్డేల్లో 14,000 రన్స్‌ పూర్తి చేసిన కోహ్లీ
X

ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ నిర్దేశించిన 242 రన్స్‌ లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లను పాక్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిది మొదటి ఓవర్‌లోనే కట్టడి చేస ప్రయత్నం చేశాడు. ఈ ఓవర్‌ లో రెండు రన్స్‌ మాత్రమే వచ్చాయి. అందులో ఒక వైడ్‌ ఉన్నది. అయితే నసీమ్‌ షా వేసిన రెండో ఓవర్‌లో కెప్టెన్‌ రోహిత్‌ తన మార్క్‌ బ్యాటింగ్‌ చూపెట్టాడు. రెండో ఓవర్‌లో మూడో బాల్‌కే ఫోర్‌ కొట్టిన రోహిత్‌.. తర్వాత బాల్‌కే స్క్వేర్‌ లెగ్‌ మీదుగా సిక్సర్‌ కొట్టాడు. రోహిత్‌ ఊపు చూసిన శుభ్‌మన్‌ గిల్‌ ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. షహీన్‌ వేసిన మూడో ఓవర్‌లో మొదటి, ఐదో బాల్ ను బౌండరీ పంపించాడు. ఇలా నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌ షాహీన్‌ వేసిన ఐదో ఓవర్‌లో షాక్‌ తగిలింది. ఐదో ఓవర్‌లో ఐదో బాల్‌కు ఫోర్‌ కొట్టిన రోహిత్‌ (20) తర్వాత బాల్‌కే క్లీన్‌ బోల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులో వచ్చిన కోహ్లీతో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఏడో ఓవర్‌లో రెండు, నాలుగు, ఐదో బాల్స్‌ను బౌండరికీ పంపాడు. 11 ఓవర్‌లో హారిస్‌ రవూఫ్‌ వేసిన 1 ఓవర్‌లో నాలుగో బాల్‌కు గిల్‌ బలంగా షాట్‌ కొట్టగా.. మిడ్‌ వికెట్‌లో ఉన్న ఖుష్‌ దిల్‌ షా చేతిలో పడింది. కానీ దాన్ని ఒడిసిపట్టుకోలేకపోయాడు. దీంతో భారత అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన గిల్‌ కాస్త నెమ్మదించగా.. కోహ్లీ తన బ్యాట్‌కు పని చెప్పాడు. హారిస్‌ రవూఫ్‌ వేసిన 13 ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలోనే 14,000 రన్స్‌ మైలురాయిని అందుకున్నాడు. 16 ఓవర్లు ముగిసే వారికి భారత్‌ 93/1 స్కోర్‌ చేసింది. అప్పటికి గిల్‌ (43), కోహ్లీ (27) క్రీజులో ఉన్నారు.

First Published:  23 Feb 2025 8:00 PM IST
Next Story