Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, May 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    భారత్ లో ఆడినట్లే ఉంది- గాల్లో తేలిపోతున్న బుమ్రా!

    By Telugu GlobalJune 11, 2024Updated:March 29, 20253 Mins Read
    భారత్ లో ఆడినట్లే ఉంది- గాల్లో తేలిపోతున్న బుమ్రా!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    న్యూయార్క్ లో ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడుతుంటే స్వదేశంలో ఆడినట్లుగానే ఉందంటూ భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మురిసిపోతున్నాడు.

    2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్ – ఏ లీగ్ మ్యాచ్ లను అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఆడుతుంటే..అచ్చం భారత గడ్డపైనే ఆడుతున్నట్లుగా అనిపించిందంటూ భారత ఓపెనింగ్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా సంబర పడిపోతున్నాడు.

    మ్యాచ్ విన్నర్ జస్ ప్రీత్ బుమ్రా….

    న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్ ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లోని రెండుమ్యాచ్ లను ఇప్పటికే ఆడేసింది. ప్రారంభమ్యాచ్ లో పసికూన ఐర్లాండ్ ను చిత్తు చేసిన భారత్..తన రెండోమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 6 పరుగులతో సంచలన విజయం సాధించింది.

    కేవలం 119 పరుగుల స్వల్పలక్ష్యాన్ని భారతజట్టు కాపాడుకోడమేకాదు..విజేతగా కూడా నిలవడంలో జస్ ప్రీత్ బుమ్రా ప్రధానపాత్ర వహించాడు. పాక్ అగ్రశ్రేణి బ్యాటర్లు బాబర్ అజమ్, రిజ్వాన్ లతో పాటు ఇఫ్తీకార్ అహ్మద్ ను అవుట్ చేయడం ద్వారా భారత విజయంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం బుమ్రానే కైవసం చేసుకొన్నాడు.

    టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకూ పాక్ ప్రత్యర్థిగా ఎనిమిదిసార్లు తలపడిన భారత్ కు ఇది 7వ విజయం. భారత్ 7 విజయాలు సాధించి..ఒకే ఒక్కసారి పాక్ చేతిలో ఓటమి చవిచూసింది.

    నిండుకుండలా న్యూయార్క్ స్టేడియం…

    చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్లు తలపడిన ఈ సూపర్ డూపర్ సండే ఫైట్ కు భారత్, పాక్ సంతతి అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. మొత్తం 24వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన నసావు స్టేడియం నిండుకుండలా మారిపోయింది. ప్రీమియం క్లాస్ టికెట్ 9 లక్షల రూపాయల ధర పలికిందంటే ..అభిమానులు ఏస్థాయిలో మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపారే మరి చెప్పాల్సిన పనిలేదు.

    నసావు స్టేడియంలో ఆడుతుంటే తనకు స్వదేశంలో ఆడుతున్న భావన కలిగిందని, ఎటుచూసినా భారత అభిమానులే కనిపించారని, ఉభయదేశాల అభిమానుల కేరింతలతో స్టేడియం సందడి సందడిగా కనిపించిందని మ్యాచ్ అనంతరం బుమ్రా వ్యాఖ్యానించాడు.

    ఇదే వేదికగా ఐర్లాండ్ తో జరిగిన ప్రారంభమ్యాచ్ లో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన ఫాస్ట్ బౌలర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన బుమ్రా…పాక్ పైన 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ-20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్ గా మరో రికార్డు సాధించాడు. పాక్ పై బుమ్రా వేసిన 24 బంతుల్లో 14 డాల్ బాల్స్ ఉండటం విశేషం.

    బుధవారం ఆతిథ్య అమెరికాతో నసావు స్టేడియం వేదికగానే తలపడటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. పసికూన అమెరికాజట్టును తాము ఏమాత్రం తక్కువగా అంచనావేయడం లేదని, గట్టిపోటీ తమకు ఎదురుకానుందని చెప్పాడు.

    అమెరికాలో ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు- విరాట్

    క్రికెట్ నేపథ్యం, మూలాలు ఏమాత్రం లేని అమెరికా వేదికగా తాను ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడతానని కలనైనా అనుకోలేదని, ఇదో వింత అనుభవమని భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ చెప్పాడు.

    ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -17 టోర్నీలో 704 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకొన్న విరాట్…ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో ఆడిన మొదటి రెండుమ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. న్యూయార్క్ లోని నసావు పిచ్ పేస్ బౌలర్లకు అనువుగా ఉండడంతో లోస్కోరింగ్ మ్యాచ్ లే నమోదవుతూ వస్తున్నాయి. భారత్ సాధించిన 119 పరుగుల స్కోరే మ్యాచ్ విన్నింగ్ స్కోరుగా నిలవడం విశేషం. మాజీ చాంపియన్లు పాక్ , శ్రీలంకతో పాటు న్యూజిలాండ్ సైతం అనుకోని పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

    మొత్తం 20 దేశాలజట్లు..నాలుగు గ్రూపులుగా తలపడుతున్న లీగ్ దశ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్- ఏ లీగ్ లో భారత్ రెండుకు రెండుమ్యాచ్ లూ నెగ్గి 4 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిస్తే..ఆతిథ్య అమెరికా సైతం 4 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. పాక్ జట్టు రెండుకు రెండుమ్యాచ్ లూ ఓడి మూడోస్థానానికి పడిపోయింది.

    లీగ్ దశలో తమ తమ గ్రూపుల్లో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన 8 జట్లతో ..ప్రపంచకప్ రెండోదశ సూపర్-8 ను నిర్వహించనున్నారు.

    ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ గ్రూపులీగ్ మిగిలిన రెండుమ్యాచ్ ల్లో అమెరికా, కెనడా జట్లతో తలపడాల్సి ఉంది.

    బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగే మూడోరౌండ్ పోరులో అమెరికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఎక్కువమంది భారత సంతతి ఆటగాళ్లతో కూడిన అమెరికా తన ప్రారంభమ్యాచ్ లో కెనడాను, రెండోమ్యాచ్ లో పాక్ ను కంగు తినిపించడం ద్వారా సూపర్- 8 రౌండ్ అర్హత కోసం తహతహలాడుతోంది.

    India Jasprit Bumrah
    Previous ArticleBajaj 2901 Chetak | భార‌త్ మార్కెట్‌లోకి బ‌జాజ్ 290 చేత‌క్‌.. రూ.95,998ల‌కే ల‌భ్యం..!
    Next Article కంటెంట్ షేర్ చేసుకునే ఆలోచన వైపు ఓటీటీలు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.