Telugu Global
Sports

భారత్‌-న్యూజిలాండ్‌ : మొదటి టెస్ట్‌ షురూ

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ సేన. శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం

భారత్‌-న్యూజిలాండ్‌ : మొదటి టెస్ట్‌ షురూ
X

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మొదటి టెస్ట్‌ మొదటి రోజు వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకున్నది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. మూడో పేసర్‌ ఆకాశ్‌దీప్‌ను కాదని కుల్‌దీప్‌యాదవ్‌ను మేనేజ్‌మెంట్‌ తీసుకున్నది. గిల్‌ వందశాతం ఫిట్ గా లేకపోవడంతో అతనికి రెస్ట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించారు.

మ్యాచ్‌ షెడ్యూల్‌ ఇలా

తొలి సెషన్‌: ఉదయం 9.15 గంటల నుంచి 111.30 గంటల వరకు

రెండో సెషన్‌: మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 2.25 గంటల వరకు

మూడో సెషన్‌ మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు

తుది జట్లు

టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్‌పంత్‌ (కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

కివీస్‌: టామ్‌ లేథమ్‌ (కెప్టెన్‌), డేవన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌ (కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మ్యాట్‌ హెన్నీ, టిమ్‌ సౌథీ , అజాజ్‌ పటేల్‌, విలియమ్‌ ఓరూర్కీ

First Published:  17 Oct 2024 4:06 AM GMT
Next Story