Telugu Global
Sports

బంగ్లాదేశ్‌ హెడ్‌ కోచ్‌పై వేటు

బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండికా హతురసింఘ‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. టీమిండియా చేతిలో ఘోర ఓటముల నేపథ్యంలో చందిక హతురుసింఘేపై సస్పెండ్ చేసింది.

బంగ్లాదేశ్‌ హెడ్‌ కోచ్‌పై వేటు
X

బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండిక హతురసింగను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) సస్పెండ్ చేసింది. ఓ ఆటగాడిపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో.. ఒప్పందంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సెలవులు తీసుకున్నాడని బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ తెలిపాడు. దీంతో హెడ్ కోచ్‌పై వేటు వేసింది. బంగ్లా జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమ్మన్స్‌ను బీసీబీ నియమించింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకు అతను ఆ బాధ్యతలో ఉంటాడు.

సిమ్మన్స్ గతంలో జింబాబ్వే, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌ జట్లుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నెలలో సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌తో సిమ్మన్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. టీమిండియాపై బంగ్లా జట్టు టెస్టు, టీ20 సిరీస్‌ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.ఈ నెల 21 నుంచి సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌ అక్టోబర్‌ 21న ఢాకా వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్‌ చట్టోగ్రామ్‌ వేదికగా అక్టోబర్‌ 29న ప్రారంభంకానుంది.

First Published:  15 Oct 2024 6:15 PM IST
Next Story