Sam Altman- Satya Nadella | మైక్రోసాఫ్ట్‌లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈఓ ఆల్టమన్.. సత్య నాదెళ్ల ఏం చేశారు..?!
Sam Altman- Satya Nadella | టెక్నాలజీ రంగంలో సంచలనాలు సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) రూపకర్త.. ఓపెన్ ఏఐ (Open AI) స్టార్టప్ మాజీ సీఈఓ శామ్ ఆల్టమన్ (Sam Altman), ఓపెన్ ఏఐ (Open AI) మాజీ ప్రెసిడెంట్ గ్రేగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) కీలక నిర్ణయం తీసుకున్నారు.
Sam Altman- Satya Nadella | టెక్నాలజీ రంగంలో సంచలనాలు సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) రూపకర్త.. ఓపెన్ ఏఐ (Open AI) స్టార్టప్ మాజీ సీఈఓ శామ్ ఆల్టమన్ (Sam Altman), ఓపెన్ ఏఐ (Open AI) మాజీ ప్రెసిడెంట్ గ్రేగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ న్యూ టీంకు శామ్ ఆల్టమన్ (Sam Altman), గ్రేగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) సారధ్యం వహించనున్నారు. ఈ సంగతి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సోమవారం ప్రకటించారు. ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్టమన్ ఉద్వాసన తర్వాత తాజా పరిణామం నెలకొంది.
శామ్ ఆల్టమన్, గ్రేక్ బ్రాక్‌మన్‌లను మైక్రోసాఫ్ట్ న్యూ ఆర్టిఫిషియల్ టీం సారధులుగా తీసుకుంటున్నట్లు ప్రకటించిన సత్య నాదెళ్ల.. ఓపెన్ ఏఐతో మా భాగస్వామ్యం కొనసాగుతుంది. మా ఉత్పత్తులను ముందుకు తీసుకువెళ్లడంలోనూ, సృజనాత్మకతతో ఏదైనా సాధించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. కస్టమర్లు, భాగస్వాముల నుంచి మద్దతు ఉంటుందని భావిస్తున్నాం. ఎమ్మెట్ సేర్, ఓపెన్ ఏఐ నూతన నాయకత్వంతో కలిసి ముందడుగు వేయడానికే మేం ప్రాధాన్యం ఇస్తాం అని ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్‌లో సహచరులతో శామ్ ఆల్టమన్, గ్రేగ్ బ్రాక్‌మన్ కలిసి పని చేస్తారని భావిస్తున్నాం. వారు న్యూ ఏఐ రీసెర్చ్ టీంకు సారధ్యం వహిస్తారు. వారి విజయానికి మా వద్ద ఉన్నవనరులను త్వరితగతిన అందుబాటులోకి తెస్తాం అని పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ న్యూ ఏఐ రీసెర్చ్ గ్రూప్‌కు సీఈఓగా శామ్ ఆల్టమన్ చేరనున్నారని సత్య నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గ్రూప్ సీఈఓగా మీ చేరిక కోసం నేను అత్యంత ఆసక్తితో ఎదురు చేస్తున్నాం. శామ్ సృజనాత్మకతలో నూతన వేగాన్ని నిర్దేశిస్తారని భావిస్తున్నాం. గిట్ హబ్ (GitHub), మోజాంగ్ స్టూడియోస్ (Mojang Studios), లింక్డ్ ఇన్ (LinkedIn)లతోపాటు ఫౌండర్లకు, ఆవిష్కర్తలకు మైక్రోసాఫ్ట్‌లో స్వతంత్ర గుర్తింపు కల్పించడంలో చాలా అనుభవం గడించాం. మీ పట్ల అదే దృక్పథంతో ముందడుగు వేస్తాం అని పేర్కొన్నారు. మిషన్ కంటిన్యూస్ అన్న పోస్ట్‌కు రిప్లయ్‌గా సత్య నాదెళ్లపై విధంగా స్పందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్ బోట్ చాట్‌జీపీటీ (ChatGPT) రూపకల్పనలో ప్రధాన పాత్రదారి శామ్ ఆల్టమన్‌ను శుక్రవారం గూగుల్ మీట్ కాల్‌లో తొలగిస్తున్నట్లు ప్రకటించిందని గ్రేగ్ బ్రాక్‌మన్ `ఎక్స్`లో ప్రకటించారు. ఆ మరునాడు మరో గూగుల్ మీట్ కాల్‌లో గ్రేగ్ బ్రాక్‌మన్‌ను బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఓపెన్ఏఐ బోర్డు. కానీ ఆయన సేవలు ముఖ్యం కనుక సంస్థ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు నిర్ణయాలను కూడా గ్రేగ్ బ్రాక్‌మన్.. ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. `శామ్ ఆల్టమన్`తోపాటు నన్ను తొలగించారు. ఈ రోజు బోర్డులో జరిగినదానిపై విచారం కలిగింది` అని కూడా పేర్కొన్నారు. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు గ్రేగ్ బ్రాక్‌మన్ ప్రకటించారు.
శామ్ ఆల్టమన్ నిష్క్రమణ తర్వాత ఓపెన్ ఏఐ స్పందిస్తూ.. శామ్ ఆల్టమన్ నిర్ణయాలను సమీక్షిస్తామని తెలిపింది. శామ్ ఆల్టమన్ ఉద్వాసన యావత్ టెక్నాలజీ రంగ ప్రముఖులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాన ఇన్వెస్టర్లు తిరిగి ఆయన్ను సంస్థ సీఈఓగా తీసుకు రావాలని ఓపెన్ ఏఐ బోర్డుపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అందులో సత్య నాదెళ్ల సారధ్యంలోని మైక్రోసాఫ్ట్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుత బోర్డును పూర్తిగా తొలగిస్తేనే తాను వస్తానని శామ్ ఆల్టమన్ షరతు విధించినట్లు తెలుస్తోంది.