Samsung Galaxy F55 5G | భారత్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు..? ధర ఎంతో తెలుసా..?!
Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది.
Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తారు. రెండు రంగు ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. శాంసంగ్ గెలాక్సీ సీ55 (Samsung Galaxy C55) ఫోన్‌ను రీబ్రాండ్ చేసి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) ఫోన్‌ను తయారు చేశారని తెలుస్తున్నది. గత నెలలో చైనా మార్కెట్‌లో ఈ ఫోన్ ఆవిష్కరించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్, 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 17 మధ్యాహ్నం 12 గంటలకు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ ఆవిష్కరిస్తారు. ఈ ఫోన్ రూ.30 వేల లోపే యూజర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ డాట్ కాంతోపాటు సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
వెగాన్ లెదర్ ఫినిష్‌తోపాటు అప్రికోట్ క్రష్, రైసిన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) ఫోన్ వస్తుందని ధృవీకరించింది. శాంసంగ్ న్యూ గెలాక్సీ ఎఫ్ సిరీస్ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌పై స్పెషల్ పేజీ డెడికేట్ చేసింది.
ఇటీవల వచ్చిన వార్తల సమాచారం మేరకు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీగా రీబ్రాండ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ సీ55 ఫోన్ సుమారు రూ.23 వేలు (1999 చైనా యువాన్లు) నుంచి ప్రారంభమైంది.
శాంసంగ్ గెలాక్సీ సీ55 ఫోన్‌లో మాదిరిగానే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది. శాంసంగ్ గెలాక్సీ సీ55 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ((1,080x2,400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్.