Telugu Global
Science and Technology

రింగ్ ఆఫ్ ఫైర్.. శనివారం ఆకాశంలో అద్భుతం!

రేపటి శనివారం రోజున అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఓ అద్భుతం కనిపించనుంని సైంటిస్టులు చెప్తున్నారు. ఉంగరం ఆకారంలో ఏర్పడే ఈ సూర్య గ్రహణాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు.

రింగ్ ఆఫ్ ఫైర్.. శనివారం ఆకాశంలో అద్భుతం!
X

రేపటి శనివారం రోజున అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఓ అద్భుతం కనిపించనుంని సైంటిస్టులు చెప్తున్నారు. ఉంగరం ఆకారంలో ఏర్పడే ఈ సూర్య గ్రహణాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. ఇదెలా ఉంటుందంటే.

శనివారం రోజున ఏర్పడే సూర్యగ్రహణంలో సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. అంటే సూర్యుని చుట్టూ ఒక అగ్ని వలయం లాంటిది కనిపిస్తుంది. దీన్ని ‘కంకణాకృతి సూర్యగ్రహణం’ అంటారు. దీన్నే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని కూడా పిలుస్తారు.

సాధారణంగా సూర్యగ్రహణం జరిగేటప్పుడు చంద్రుడు సూర్యుడ్ని పూర్తిగా కప్పేస్తాడు. అప్పుడు దాన్ని సంపూర్ణ సూర్య గ్రహణం అంటారు. అయితే ఏడాది చివర్లో జరిగే కొన్ని సూర్యగ్రహణాల టైంలో.. చంద్రుడు భూమి కక్ష్యలో సూర్యుడికి దూరంగా ఉంటాడు. ఆ కారణంగా చంద్రుడి పరిమాణం కాస్త తగ్గినట్టు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏర్పడే సూర్యగ్రహణాల్లో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయలేడు. అప్పుడు చంద్రుడి వెనుక ఉన్న సూర్యుడు రింగ్ ఆకారంలో మెరుస్తూ కనిపిస్తాడు. ఇదే రింగ్ ఆఫ్ ఫైర్ అంటే. ఇలాంటి సూర్యగ్రహణం చూడ్డానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి గ్రహణాలు అరుదుగా సంభవిస్తుంటాయి.

బ్యాడ్ లక్ ఏంటంటే.. ఈ రింగ్ ఆఫ్ ఫైర్.. మనదేశంలో కనిపించదు. గ్రహణం ఏర్పడే సమయానికి ఇక్కడ చీకటిపడుతుంది. సూర్య గ్రహణం సమయానికి సూర్యుడు భారతదేశానికి వ్యతిరేఖ దిశలో జరుగుతాడు. కాబట్టి ఈ గ్రహణం నార్త్, సౌత్ అమెరికా దేశాల్లో కనిపించనుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. రింగ్ ఆఫ్ ఫైర్ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత కాలమానం ప్రకారం సూర్య గ్రహణాన్ని రాత్రి 8.35 గంటలకు లైవ్‌లో చూడొచ్చు.

First Published:  13 Oct 2023 6:47 PM IST
Next Story