త్వరలోనే మోటో జీ85 లాంఛ్! స్పెషల్ ఫీచర్లివే!
వచ్చే వారం జులై10న ఇండియన్ మార్కెట్లో ‘మోటో జీ85 5జీ’ మొబైల్ లాంచ్ కానున్నట్టు మోటొరోలా కంపెనీ అనౌన్స్ చేసింది.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా నుంచి ‘మోటో జీ85 (Moto G85)’ పేరుతో సరికొత్త 5జీ మొబైల్ లాంఛ్ అవ్వబోతోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధరల వివరాల్లోకి వెళ్తే..
వచ్చే వారం జులై10న ఇండియన్ మార్కెట్లో ‘మోటో జీ85 5జీ’ మొబైల్ లాంచ్ కానున్నట్టు మోటొరోలా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 వెర్షన్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
మోటో జీ85 కెమెరాల విషయానికొస్తే.. ఇందులో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో వస్తుంది. దీంతోపాటు మరో 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, ముందువైపు 32ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. అలాగే ఇందులో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 38 గంటల టాక్ టైమ్, 22 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ చెప్తోంది.
ఇకపోతే మోటో జీ85 లో డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, వైఫై 5, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు, యూఎఫ్ ఎస్ 2.0 స్టోరేజ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లతో పాటు స్మార్ట్ కనెక్ట్, ఫ్యామిలీ స్పేస్, మోటో సెక్యూర్ వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మొబైల్ బేసిక్ వేరియంట్ ధర రూ. 24,999 ఉండొచ్చు. కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్, అర్బన్ గ్రే అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.