Telugu Global
Science and Technology

Infinix | నూత‌న చార్జింగ్ టెక్నాల‌జీతో భారత్ మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ అండ్ ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ..!

Infinix | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix 40 Pro+ 5G), ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix 40 Pro 5G) ఫోన్లను శుక్రవారం మార్కెట్లో ఆవిష్కరించింది.

Infinix | నూత‌న చార్జింగ్ టెక్నాల‌జీతో భారత్ మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ అండ్ ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ..!
X

Infinix | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix 40 Pro+ 5G), ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix 40 Pro 5G) ఫోన్లను శుక్రవారం మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు ఫోన్లూ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ (MediaTek Dimensity 7020 SoC) చిప్‌సెట్‌తో వస్తున్నాయి. ఇన్ హౌస్ చీతా ఎక్స్1 పవర్ మేనేజ్‌మెంట్ చిప్ కొత్తగా జత చేశారు. మూడు డైనమిక్ చార్జింగ్ మోడ్స్‌లో హైప‌ర్‌, స్మార్ట్‌, లో టెంప‌రేచ‌ర్ మోడ్స్‌లో చార్జింగ్ అవుతుంది.

108-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, కర్వ్‌డ్ మోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్ 100 వాట్ల చార్జర్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. గత నెలలోనే రెండు ఫోన్లనూ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది ఇన్‌ఫినిక్స్. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి. మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్, రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ అందిస్తుంది.

ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix 40 Pro+ 5G) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తుంది. ఒబ్సిడియన్ బ్లాక్, వింటేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix 40 Pro 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 21,999లకు వింటేజ్ గ్రీన్, టైటాన్ గోల్డెన్ షేడ్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎర్లీ బడ్ ఆఫర్ కింద ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్‌తోపాటు రూ.4999 విలువైన ఫ్రీ మ్యాగ్‌కిట్ అందుకోవచ్చు. మ్యాగ్‌కిట్‌లో రూ.3999 విలువైన ఇన్ ఫినిక్స్ మ్యాగ్ పవర్ బ్యాంక్, రూ.1000 ధర గల ఇన్‌ఫినిక్స్ మ్యాగ్ కేస్ లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ జరుగుతాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.

ఇన్ ఫినిక్స్ నోట్ 40ప్రో+ 5జీ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080x2436 పిక్సెల్స్) కర్వ్ డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1500 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్స్, 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తోంది.

ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 108 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా అండ్ 3ఎక్స్ జూమ్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్, ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటాయి.

ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు న్యూ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి. కంపెనీ ఇన్ హౌస్ ‘చీతా ఎక్స్1 చిప్’ కలిగి ఉంటాయి. ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్ 100వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. రెండు ఫోన్లకూ 20 వాట్ల మ్యాగ్నటిక్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతు ఉంటుంది. ఈ రెండు ఫోన్ల‌తోపాటు 15వాట్ల మ్యాగ్ పాడ్ కంపాటిబుల్ క్యూఐ అండ్ ఈపీపీ స్టాండ‌ర్డ్ ప్రొటోకాల్స్ ఆవిష్క‌రించారు.

First Published:  13 April 2024 10:48 AM IST
Next Story