Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, June 24
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»More

    ఇస్రో మరో ఘనత .. లగ్రాంజ్ పాయింట్ లోకి ప్రవేశించిన ‘ఆదిత్య ఎల్ 1’

    By Telugu GlobalJanuary 6, 20242 Mins Read
    ఇస్రో మరో ఘనత .. లగ్రాంజ్ పాయింట్ లోకి ప్రవేశించిన 'ఆదిత్య ఎల్ 1'
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు శనివారం చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతమైంది.

    భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఈ వ్యోమనౌకను సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఈ ఆదిత్య ఎల్ 1.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ప్రయోగం కావడం గమనార్హం. అలాగే ఈ ప్రయోగంతో తొలి ప్రయతంలోనే సోలార్‌ మిషన్‌ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా భారదేశం నిలిచింది..సెప్టెంబరు 18 వ తేదీ నుంచే సూర్యుడి శాస్త్రీయ సమాచారం సేకరించడం మొదలు పెట్టిన ఆదిత్య ఎల్ 1.. సెప్టెంబరు 19 వ తేదీ నుంచి సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

    సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా ‘ఆదిత్య L1’ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలపై అధ్యయనం చేస్తుంది. మూన్ మిషన్ లాగ సూర్యునిపై అడిగి పెట్టే అవకాశం ఉండదు కాబట్టి . ఈ ఆదిత్య ఎల్ 1 సూర్యుడికి దూరంగానే ఉంటూ అక్కడ ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. దీని వల్ల అంతరిక్షంలో ఉన్న భారత శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు.

    ఇది సౌర తుఫానులు దాటిపోయేంత వరకు మన శాటిలైట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ మోడ్‌లో ఉంచేందుకు సాయపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్స్ మోసుకెళ్లింది. ఇవి సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు కీలకమైన సమాచారాన్నిపరిశీలిస్తాయి.

    Aditya L1 ISRO
    Previous ArticleBest Smart Phones | రూ.35 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. రెడ్‌మీ నోట్ 13 ప్రో నుంచి వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 3 వ‌ర‌కూ.. ఇవీ డిటైల్స్‌..!
    Next Article కన్జూరింగ్ కన్నప్పన్ –తెలుగు రివ్యూ! {2/5}
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.