Google Pixel 8 Series Phones | సెర్చింజన్ గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8), గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) స్మార్ట్ ఫోన్లను భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. గతేడాది ఆవిష్కరించిన గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7)` సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా గూగుల్ పిక్సెల్8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్లను తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు కాస్త ఖర్చుతో కూడుకున్నవి. కానీ. వాటి ధరలపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది గూగుల్.
భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్ ధర రూ.75,999, గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ధర రూ.1,06,999 పలుకుతున్నాయి. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఫోన్ల ధరలతో పోలిస్తే 26.6 శాతం, 25.8 శాతం ఎక్కువ. పిక్సెల్ 7 ఫోన్ ధర రూ.59,999, పిక్సెల్ 7 ప్రో ఫోన్ ధర రూ.84,999. ప్రస్తుతం ప్లిప్‌కార్ట్‌పై గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.
ఇవీ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లపై బ్యాంకు ఆఫర్లు డిస్కౌంట్లు
గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్ రూ.64,999లకే లభ్యం అవుతుంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.8,000, అదనంగా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.3,000 ఆఫర్ చేస్తున్నది గూగుల్. ఇక గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్‌పై రూ.13,000 డిస్కౌంట్, రాయితీ లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా రూ.9,000, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.4,000 తగ్గింపుతో గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ రూ.93,999 లకు పొందొచ్చు. ఈ డిస్కౌంట్లు పొందాలంటే మీరు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేయాలి. వీటితోపాటు న్యూ పిక్సెల్ వాచ్2 (Google Pixel Watch 2) ధర రూ.39,990, పిక్సెల్ బడ్స్ ప్రో (Pixel Buds Pro) స్పెషల్ ధరపై రూ.19,999, రూ.8,999లకు లభిస్తాయి.
ఇవీ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ స్పెషిఫికేషన్స్.. !
గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8), గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్లు ఆండ్రాయిడ్ 14 వర్షన్‌పై పని చేస్తాయి. గూగుల్ టెన్సర్ జీ3 చిప్‌సెట్ అండ్ టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో రూపుదిద్దుకున్నాయి. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ 12 జీబీ ర్యామ్‌తో 6.2 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోనూ, గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ 6.7-అంగుళాల ఓలెడ్ స్క్రీన్ విత్ 1-120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్8 ఫోన్.. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా.., పిక్సెల్ 8 ప్రో ఫోన్ 64-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంటాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం.. సెంటర్ అలైన్డ్ హోల్ పంచ్ డిస్‌ప్లే కటౌట్‌లో 11-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ 4,575 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ 27వాట్ల చార్జింగ్.. పిక్సెల్ 8 ప్రో ఫోన్ 30 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5,050 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ రికగ్నిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.