మామిడిపండు కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే జామపండు క్వీన్ లాంటిది అంటున్నారు న్యూట్రిషనిస్టులు. విరివిగా లభిస్తూ.. అన్నిరకాల పోషకాలను అందించడం జామ పండు ప్రత్యేకత. అసలు జామపండు ఎందుకు తినాలంటే..
విటమిన్–సీ
పులుపు లేకుండా విటమిన్– సీ ని అందించే ఏకైక పండు జామపండు. రోజుకో జామపండు తింటే ఆ రోజుకి కావల్సిన విటమిన్–సీ లభిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది.
హార్ట్ హెల్త్
జామపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బుల్ని తగ్గిస్తాయి. జామపండు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి కార్డియోవాస్కులర్ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది.
స్కిన్ హెల్త్
జామపండులో ఉండే ‘ఎ’,‘ బి’ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని రిపేర్ చేస్తాయి. ముడతలు, మచ్చల్ని తగ్గించి చర్మం మెరిసేలా చేస్తాయి.
క్యాన్సర్ దూరం
జామలో ఉండే లైకోపిన్, క్వెర్సెటిన్, పాలీఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి.
షుగర్ కంట్రోల్
జామపండు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. పైగా ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. బరువు కూడా అదుపులో ఉంటుంది.
ప్రెగ్నెన్సీ హెల్త్
జామపండులోని ఫోలిక్ యాసిడ్, విటమిన్– బీ9 గర్భిణుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామపండు నెలసరి నొప్పులను కూడా దూరం చేస్తుంది.
ఓవరాల్ హెల్త్
జామపండులో పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, విటమిన్- బీ3, బీ6, బీ9, విటమిన్ ఎ, సీ పుష్కలంగా ఉంటాయి. జామలో యాంటీఆక్సిడెంట్స్ శాతం కూడా ఎక్కువే. అందుకే రోజుకో జామపండు తింటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.