పంచదార‌కు ఆల్టర్నేటివ్స్ ఇవే!

తీపి కోసం
రిఫైన్డ్ షుగర్ వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తాయని మనకు తెలిసిందే. అయినప్పటికీ తీపి కోసం రిఫైన్డ్ షుగర్ మీదనే ఆధారపడతారు చాలామంది. అయితే పంచదారకు బదులుగా వాడుకోదగ్గ కొన్ని నేచురల్ స్వీటెనర్స్ కూడా మనకు అందుబాటులోఉన్నాయని మీకు తెలుసా?
మాపుల్ సిరప్
మాపుల్ చెట్ల నుంచి తీసే ఈ సిరప్ తియ్యగా ఉంటుంది. దీన్ని వంటకాల్లో వాడుకోవచ్చు. ఇందులో క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
స్టెవియా షుగర్
స్టెవియా అనే మొక్క ఆకుల నుంచి తీసే ఈ షుగర్‌‌లో క్యాలరీలు ఉండవు. ఇది సహజమైన స్వీటెనర్. టీ, కాఫీలకు ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
డేట్ షుగర్
ఎండు ఖర్జూరం నుంచి తయారుచేసే షుగర్‌‌ను డేట్ షుగర్ అంటారు. మినరల్స్, విటమిన్స్‌తో పాటు ఫైబర్ కూడా ఉండే ఈ షుగర్‌‌ను పంచదారకు ఆల్టర్నేటివ్‌గా వాడుకోవచ్చు.
తేనె
తేనె సహజంగా పువ్వుల మకరందం నుంచి తయారవుతంది. ఈ నేచురల్ స్వీటెనర్‌‌ను రోజవారీ టీ, కాఫీల్లో వాడుకోవచ్చు. ఇందులో మిటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
బ్రౌన్ షుగర్
బ్రౌన్ షుగర్‌‌ను చెరకునుంచే తయారుచేసినా.. దీని ప్రాసెస్ పూర్తిగా వేరు. వైట్ షుగర్‌‌తో పోలిస్తే ఇది ఎంతో హెల్దీ. ఇందులో తక్కువ క్యాలరీలతో పాటు ఐరన్, జింక్, కాపర్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
తాటి బెల్లం
తాటి పండ్ల నుంచి తయారు చేసే తాటి బెల్లాన్ని స్వీట్ల తయారీలో వాడుకోవచ్చు. ఇందులో ఐరన్‌తో పాటు పలు విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.