గుడ్డు ఒక సూపర్ ఫుడ్. గుడ్డులో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకో గుడ్డు తినడం వల్ల ఏయే బెనిఫిట్స్ ఉంటాయంటే..
న్యూట్రిషన్ ఇలా..
రోజుకో గుడ్డు తినడం వల్ల పోషకాహార లోపం ఉండదు. గుడ్డులో ప్రొటీన్స్, విటమిన్స్‌తో పాటు హెల్దీ ఫ్యాట్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
బ్రెయిన్ హెల్త్
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా గుడ్డు తినాలి. రోజుకో గుడ్డు తినడం వల్ల మెదడుకి కావల్సిన పోషకాలు, అమైనో యాసిడ్స్ పుష్కలంగా అందుతాయి.
గుండె ఆరోగ్యం
గుడ్డు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. తద్వారా గుండె పోటు రిస్క్ తగ్గుతుంది.
బోన్ హెల్త్
ఎముకల ఆరోగ్యానికి కూడా గుడ్డు మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్–డి సోర్సెస్.. క్యాల్షియం అబ్జార్‌ప్షన్‌ను పెంచుతాయి. తద్వారా ఎముకలు, కీళ్లు బలంగా ఉంటాయి.
ప్రొటీన్ కోసం..
ప్రొటీన్ లోపంలో బాధపడేవారికి గుడ్డు బెస్ట్ చాయిస్. రోజుకో గుడ్డు తింటే మినిమం ప్రొటీన్ లభిస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి కూడా గుడ్డు మంచి ఛాయిస్.
స్కిన్ అండ్ హెయిర్
స్కిన్ కేర్ విషయంలో కూడా గుడ్డుతో చాలా లాభాలున్నాయి. గుడ్డు తినడం వల్ల చర్మం తేమగా ఉండడమేకాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కళ్ల ఆరోగ్యానికి కూడా గుడ్డు మంచిది.