వర్షాకాలంలో థ్రిల్‌నిచ్చే ఫుడ్స్ ఇవే!

వేడి వేడిగా..
సీజన్‌కు తగ్గట్టు నోరు రుచులు కోరుతుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని ఫుడ్స్ ప్రత్యేకమైన ఫీల్‌నిస్తాయి. అలాంటి బెస్ట్ మాన్‌సూన్ డిషెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మొక్కజొన్న పొత్తులు
వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ ఫీలే వేరు. మొక్కజొన్న పొత్తులు హెల్దీ కూడా. క్లైమెట్ చల్లగా ఉన్నప్పుడు కంకెలను కాల్చి లేదా ఉడకబెట్టుకుని తింటే బాగుంటుంది.
సూప్స్
వర్షాకాలం సూప్స్ కూడా మంచి ఫీల్‌నిస్తాయి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడి వేడి సూప్స్ తాగితే గొంతుకి హాయిగా అనిపించడంతోపాటు జలుబు దగ్గు వంటివి కూడా తగ్గుతాయి.
పకోడీ
వర్షం కురిసేటప్పుడు పకోడీలు తినడాన్ని చాలామంది ఇష్టపడుతుంటాయి. అయితే నూనెలో వేగించి చేసే వీటిని లైట్‌గా తీసుకుంటే మంచిది. కేవలం ఉల్లిపాయలతోనే కాకుండా ఆకుకూరలతో కూడా పకోడీలు చేసుకోవచ్చు.
మసాలా ఛాయ్
వర్షాలు పడేటప్పుడు దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు కలిపి వేసి చేసిన మసాలా ఛాయ్ తాగితే చాలా బాగుంటుంది. మసాలా టీ.. ఈ సీజన్‌లో వచ్చే జలుబు దగ్గులను కూడా తగ్గిస్తుంది.
కిచిడీ
పెసపప్పు, కాయగూరలు, రైస్‌తో చేసే కిచిడీ కూడా మాన్‌సూన్‌కు సూట్ అయ్యే డిష్‌లలో ఒకటి. ఇది తేలిగ్గా జీర్ణమవ్వడంతోపాటు మంచి శక్తిని కూడా ఇస్తుంది.
హెర్బల్ టీలు
వర్షాలు పడేటప్పుడు హెర్బల్ టీలు కూడా మంచి ఫీల్‌నిస్తాయి. హెర్బల్ టీలు ఎలర్జీలను తగ్గించడంతోపాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. పైగా వీటిలో బోలెడు రకాలున్నాయి. నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు.