ఫ్యూచర్లో డిమాండ్ ఉండే జాబ్స్ ఇవే!

మారిన ఈక్వేషన్స్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రావడం, ఐటీ జాబ్స్‌కు పోటీ పెరగడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ ఈక్వేషన్స్ మారిపోయాయి. నిపుణుల అంచనా ప్రకారం ఫ్యూచర్‌‌లో ఏయే రంగాల్లో ఎక్కువ జాబ్స్ ఉండే అవకాశం ఉందంటే..
ఐటీ
ఐటీ రంగంలో ఎంత పోటీ పెరిగినా దానికుండే డిమాండ్ దానికుంటుది. అయితే ట్రెడిషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కంటే డేటా సైంటిస్ట్, ప్రాంప్ట్ ఇంజినీర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్, క్లౌడ్ ఎక్స్‌పర్ట్స్ వంటి జాబ్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తుంది.
టూరిజం & హాస్పిటాలిటీ
ఫ్యూచర్‌‌లో టూరిజం మార్కెట్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం రంగాల్లో ఎక్కువ ఉద్యోగుల అవసరం కనిపిస్తుంది.
రోబోటిక్స్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఆధారంగా పనిచేసే రోబోటిక్ టూల్స్ తయారీ కూడా పెరుగుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో రోబోటిక్ సైన్సెస్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి.
మీడియా
కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్ రోజురోజుకీ డెవలప్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా రంగాలు, శాటిలైట్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి.
డిజిటల్ మార్కెటింగ్
రోజురోజుకీ డిజిటల్ లైఫ్‌స్టైల్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రమోషన్స్, మార్కెటింగ్, సేల్స్ వంటివన్నీ పూర్తిగా డిజిటల్ మాధ్యమాల ద్వారానే జరుగుతాయి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్స్‌కు మంచి అవకాశాలు ఉంటాయి.
ఇవి ఎవర్ గ్రీన్
ఇక వీటితోపాటు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా, హెల్త్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు ఎప్పుడూ డిమాండ్ ఉండనే ఉంటుంది.