ఈ ఆహారాలు అమృతంతో సమానం!

అన్ని రోగాలు మాయం
మనం రోజువారీ తీసుకునే ఆహారాల్లో అమృతంలాగా పనిచేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి శరీరంలోని ప్రతి కణాన్ని మెరుగుపరచి పూర్తి ఆరోగ్యాన్నిస్తాయి. అవేంటంటే..
తేనె
ప్రతి రోజూ ఒక స్పూన్ తేనె తీసుకుంటే ఇమ్యూనిటీ ఎప్పుడూ స్టేబుల్‌గా ఉంటుంది. నేచురల్ యాంటీ బయాటిక్‌గా పనిచేసే తేనె.. అనారోగ్యాలు రాకుండా కాపాడడంలో ముందుటుంది.
పసుపు
మనం కూరల్లో ఎక్కువగా వాడే పసుపుని గోల్డెన్ స్పైస్ అంటారు. ఇందులో ఉండే కాంపౌండ్స్ శరీరంలోని అన్నిరకాల క్రిములతో పోరాడడమే కాకుండా ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడతాయి.
నెయ్యి
మెదడు ఆరోగ్యం నుంచి పొట్ట ఆరోగ్యం వరకూ నెయ్యితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్స్.. బ్రెయిన్ ఫంక్షన్‌ను మెరుగుపరచి నరాలకు శక్తినిస్తాయి.
ఉసిరి
ఇమ్యూనిటీని వేగంగా పెంచే ఫుడ్స్‌లో ఉసిరి ముందుంటుంది. ఇది లివర్‌‌ను డీటాక్స్ చేస్తుంది. తరచూ ఉసిరిని తీసుకోవడం వల్ల సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకూ అన్నీ తగ్గుముఖం పడతాయి.
తులసి
శ్వాస సమస్యలు తగ్గడానికి, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి తులసి చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఓవరాల్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయి.
అల్లం
అల్లం డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. శ్వాస సమస్యలను, కఫాన్ని తగ్గించి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. ఇది ఓవరాల్ ఇమ్యూనిటీకి మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది.