జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ.. అనుకున్న దాంట్లో విజయం సాధిస్తూ ఉండాలంటే లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరు అలవాట్లను మార్చుకోగలిగితే దేన్నైనా సాధించొచ్చట. అవేంటంటే..
డైట్
ఆరోగ్యం సరిగా లేకపోతే మనసంతా శరీరం మీదే ఉంటుంది. కాబట్టి దేన్నైనా సాధించాలంటే దానికి అనారోగ్యం అడ్డు కాకుండా చూసుకోవాలి. దీనికోసం సరైన డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తుండాలి.
ఒత్తిడి లేకుండా
రోజువారీ జీవితంలో ఒత్తిడి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయే కారణాల వల్ల ఒత్తిడి వస్తుందో గమనించి వాటిని సరిచేసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేనిమీదైనా ఫోకస్ కుదురుతుంది.
డైరీ
ఇక మూడో విషయం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీన్ని మెరుగుపరచుకోవడం కోసం మీ మనసులోని భావాలను పుస్తకంలో రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా రాయడం వల్ల నెగెటివ్ ఎమోషన్స్ తగ్గిపోతాయి. తద్వారా జీవితంపై క్లారిటీ వస్తుంది. మీకు ఏం కావాలో స్పష్టత వస్తుంది.
బుక్ రీడింగ్
కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్త ఆలోచనా విధానాలను అలవరచుకోకపోతే జీవితంలో ఉన్నచోటే ఉండిపోతారు. కాబట్టి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది.
గ్రాటిట్యూడ్
లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా సాగిపోవాలంటే మీకున్న వాటిపట్ల థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే కోరికలు తగ్గి పాజిటివిటీ పెరుగుతుంది. తద్వారా ప్రశాంతత అలవడుతుంది.
టైం టేబుల్
ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి సమయపాలన అవసరం. కాబట్టి మీ లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టు ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ పెట్టుకుని దాన్ని పాటించడం అలవాటు చేసుకోవాలి.