ఫిట్‌గా ఉండాలనుకునేవాళ్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు వ్యాయామాలతో పాటు కొన్ని విటమిన్లు డైట్‌లో తప్పక చేర్చుకోవాలి అప్పుడే పూర్తి ఫిట్‌నెస్ సొంతమవుతుంది. ఫిట్‌నెస్ కోసం ఏయే విటమిన్లు తీసుకోవాలంటే.
విటమిన్– బీ12
రక్త కణాల తయారీకి, శరీరం శక్తిని గ్రహించడానికి, కండరాల నిర్మాణానికి బీ12 విటమిన్ అత్యంత కీలకం. కాబట్టి ఫిట్‌నెస్ కోరుకునేవాళ్లు బీ12 తప్పక తీసుకోవాలి. గుడ్లు, పెరుగు, సోయా బీన్స్‌లో ఈ విటమిన్ ఉంటుంది.
విటమిన్– సీ
‘సీ’ విటమిన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇది ఓవరాల్ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు వ్యాయామాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్‌లలో ‘సీ’ విటమిన్ ఉంటుంది.
విటమిన్– డి
శరీరం క్యాల్షియం గ్రహించడానికి ‘డి’ విటమిన్ అవసరం. విటమిన్– డి సరైన పాళ్లలో లేకపోతే వ్యాయామాల వల్ల కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయపు ఎండ ద్వారా ‘డి’ విటమిన్ లభిస్తుంది.
విటమిన్ –ఇ
ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ రాకుండా, సెల్ డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తుంది. కాబట్టి జిమ్ వర్కవుట్స్ చేసేవాళ్లు ‘ఇ’ విటమిన్ తప్పక తీసుకోవాలి. నట్స్, ఆవకాడో, చేపల్లో ‘ఇ’ విటమిన్ ఉంటుంది.
విటమిన్– కె
ఎముకల ఆరోగ్యానికి ‘కె’ విటమిన్ అవసరం. ఇది శరీరంలో క్యాల్షియంను రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి వర్కవుట్స్ చేసేవాళ్లు ‘కె’ విటమిన్ తీసుకోవాలి. మొలకలు, ఆకుకూరలు, క్యాబేజీ, బ్రొకలీ వంటి వాటిలో ‘కె’ విటమిన్ ఉంటుంది.
విటమిన్– బీ6
బీ6 విటమిన్ శరీరంలో ప్రొటీన్ మెటబాలిజాన్ని పెంచుతుంది. కాబట్టి వ్యాయామాలు చేసేవాళ్లు ఈ విటమిన్ తీసుకుంటే ప్రొటీన్ చక్కగా ఒంటికి పడుతుంది. చేపలు, మాంసం, కూరగాయల్లో బీ6 విటమిన్ లభిస్తుంది.