ఈ అలవాట్లు ఇమ్యూనిటీని తగ్గిస్తాయి!

ఇమ్యూనిటీ తగ్గితే..
డైలీ లైఫ్‌స్టైల్‌లో తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ శరీరంలోని ఇమ్యూనిటీ తగ్గిస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గితే వెంటనే అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఓవరాల్ హెల్త్ దెబ్బ తింటుంది. కాబట్టి ఇమ్యూనిటీని తగ్గించే అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
నిద్ర లేకపోతే..
రోజులో తగినంత నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్రపోవడం చాలా అవసరం.
ఒత్తిడి
రోజువారీ జీవితంలో ఒత్తిడి ఎక్కువైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. శరీరంలోని హార్మోన్లన్నీ ఒత్తిడి వల్ల ప్రభావితం అవుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి అమాంతం తగ్గిపోతుంది.
యాంటీ బయాటిక్స్
తరచుగా యాంటీ బయాటిక్స్ వాడుతుంటే కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల క్రమంగా శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా నశించి ఇమ్యూనిటీ లోపించేలా చేస్తుంది.
షుగర్ వాడకం
హై షుగర్ కంటెంట్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ రెస్పాన్స్ తగ్గిపోతుంది. షుగర్ ఎక్కువగా తీసుకునే అలవాటు శరీరంలో ఇంటర్నల్ ఇంఫ్లమేషన్ పెరిగేలా చేసి రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది.
‘డి’ విటమిన్ లోపం
శరీరంలో అన్ని విటమిన్లు ఉన్నా.. ‘డి’ విటమిన్ లేకపోత శరీర క్రియలు ఆగిపోతాయి. తద్వారా రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది.
శుభ్రత లేకపోతే
రోజువారీ లైఫ్‌స్టైల్‌లో పరిశుభ్రత లేకపోతే.. శరీరానికి క్రిముల ఎక్స్‌పోజర్ పెరుగుతుంది. దీని వల్ల ఇమ్యూన్ ఫంక్షన్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది.