జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం వంటి ఈ రోజుల్లో చాలా కామన్‌గా కనిపిస్తున్న ప్రాబ్లమ్. అయితే కొన్ని బేసిక్ ప్రికాషన్స్‌తో హెయిర్ ఫాల్‌ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అదెలాగంటే.
సరైన షాంపూ
జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్లు సరైన షాంపూ, కండిషనర్‌లు ఎంచుకోవాలి. ఎన్ని షాంపూలు మార్చినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదంటే.. వాటిని మానేసి సహజమైన క్లెన్సర్‌లతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
అతిగా వద్దు
జుట్టు రాలుతున్న వాళ్లు అతిగా తలస్నానం చేయకూడదు. దీనివల్ల కుదుళ్లు మరింత బలహీన పడే అవకాశం ఉంది. వారానికి రెండు సార్లు హెయిర్ వాష్ చేసుకోవచ్చు.
ఆయిల్ తప్పనిసరి
జుట్టు రాలుతుంటే తప్పకుండా తలను నూనె రాసుకోవాలి. నూనె వాడడం వల్ల కుదుళ్లకు పోషణ అందుతుంది. జుట్టు బలంగా తయారవుతుంది.
ఇవి వాడొద్దు
జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్లు హెయిర్ స్ట్రైటెనర్లు, డ్రయ్యర్లు, హెయిర్ కలర్స్, స్ప్రేల వంటివి వాడకపోతేనే మంచిది. కనీసం హెయిర్ ఫాల్ తగ్గేవరకైనా వీటికి దూరంగా ఉండాలి.
వెడల్పాంటి దువ్వెన
జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్లు వెడల్పాంటి దువ్వెనతో జుట్టు దువ్వుకోవాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వుకోవాలి. జుట్టు మరింత చిక్కుపడేలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ మరింత పెరుగుతుంది.
బ్యాలెన్స్‌డ్ డైట్
జుట్టు రాలడం తగ్గాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. విటమిన్–ఎ ఉండే క్యారెట్లు, బీట్‌రూట్, ఆకుకూరలు తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ కోసం నట్స్, చేపలు తినాలి.