నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ గేమ్స్.. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్‌లో జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈవెంట్లు ఎన్నంటే..
పారిస్ ఒలింపిక్స్ వేదికగా మొత్తం 329 ఈవెంట్లు జరగనున్నాయి. ఇందులో 32 స్పోర్ట్స్ కాగా మిగతావి గేమ్స్ కేటగిరీ కిందకు వస్తాయి.
ఆడా మగా సమానంగా
ఈ సారి ఒలింపిక్స్‌లో మేల్, ఫిమేల్ అథ్లెట్లు సమాన సంఖ్యలో పాల్గొనబోతున్నారు. మొత్తం 10,500 అథ్లెట్లలో 5,250 మంది అమ్మాయిలు, 5,250 మంది అబ్బాయిలు ఉన్నారు.
ఈఫిల్ మెడల్స్
ఈ సారి ఒలింపిక్స్ విజేతలకు మెడల్స్‌తో పాటు పారిస్ మెమరీస్‌ని కూడా జత చేయనున్నారు. విన్నర్స్‌కు అందజేసే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌లో ఈఫిల్ టవర్ నుంచి తీసిన 18 గ్రాముల ఇనుము కలిపి మెడల్స్ తయారుచేశారు.
పారిస్‌లో మూడోసారి
ఒలింపిక్స్‌కు వేదిక అవ్వడానికి చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. అయితే పారిస్ మాత్రం మూడోసారి ఒలింపిక్స్‌ను హోస్ట్ చేస్తుంది. గతంలో 1900, 1924 లో పారిస్.. ఒలింపిక్స్‌కు వేదిక అయింది.
ఇండియా ఇలా..
ఈ ఒలింపిక్స్‌లో ఇండియా మొత్తం16 విభాగాల్లో పార్టిసిపేట్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో ఇండియన్ షూటర్ మను బాకర్ బ్రాంజ్ మెడల్ సాధించింది.
యంగెస్ట్ అథ్లెట్
200 మీటర్స్ ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో పాల్గొంటున్న ధినిధి.. మనదేశం నుంచి పార్టిసిపేట్ చేస్తున్న యంగెస్ట్ అథ్లెట్. ఈమె వయసు 14 ఏళ్లు.