వెయిట్ లాస్ లేదా ఫిట్‌నెస్ కోసం చాలామంది చాలారకాల డైట్‌లు ఫాలో అవుతుంటారు. అయితే వీటిలో ఒక్కో డైట్‌తో ఒక్కో బెనిఫిట్ ఉండడంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కీటో డైట్
తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఫ్యాట్స్‌ను తీసుకునే కీటో డైట్ వల్ల లాంగ్ టర్మ్‌లో పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వీగన్ డైట్
కేవలం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మాత్రమే ఉండే వీగన్ డైట్‌లో పాలు, పాల పదార్థాలు కూడా ముట్టరు. దీనివల్ల విటమిన్– బీ12 లోపం వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఫుడ్ తీసుకుంటూ కొన్ని గంటల పాటు పూర్తిగా ఫాస్టింగ్ ఉండే ఈ పద్ధతి వల్ల వేగంగా బరువు తగ్గుతారు. అయితే ఈ విధానం వల్ల నీరసం, నిద్ర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
లిక్విడ్ డైట్
కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకునే ఈ డైట్ వల్ల పోషకాహార లోపం ముఖ్యంగా ప్రొటీన్ లోపం తలెత్తే అవకాశం ఉంటుంది.
మెడిటరేనియన్ డైట్
పండ్లు, కాయగూరలు, గింజలు, నట్స్, సీఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకునే ఈ డైట్ వల్ల లాంగ్ టర్మ్‌లో బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
డ్యాష్ డైట్
ఉప్పు, పాల పదార్థాలు తక్కువగా తీసుకుంటూ పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్ వంటివి తీసుకునే ఈ డైట్ బీపీని తగ్గిస్తుంది. అయితే ఈ డైట్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉండొచ్చు.