వేసవిలో మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!

మామిడి పండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
మామిడి పండ్ల‌లో ఐర‌న్‌ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధ‌పడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి మామిడిపండ్లు తోడ్ప‌డుతాయి.
మెదడు ఆరోగ్యానికి మామిడి పండ్లు బాగా ప‌నిచేస్తాయి.
మామిడిపండులో బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది.
మామిడి పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.