టీనేజ్, యంగ్ ఏజ్‌లో ఉన్న చాలామందిలో మొటిమల సమస్య కామన్‌గా కనిపిస్తుంది. ఈ వయసులో శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో వీటిని తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..
ఒత్తిడి ఉండకూడదు
ఒత్తిడి వల్ల మొటిమల సమస్య మరింత ఎక్కువవుతుంది. కాబట్టి టీనేజ్ వాళ్లు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సోషల్ మీడియా అడిక్షన్, మొబైల్ గేమింగ్ వంటివి తగ్గించుకోవాలి.
గిల్లకూడదు
మొటిమలు రాగానే వాటిని ఎలాగైనా తొలగించాలని అదేపనిగా వాటిని గిల్లుతూ ఉంటారు చాలామంది. దీనివల్ల మొటిమలు మరింత పెరిగి మచ్చలు పడుతుంటాయి. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి.
మేకప్ వద్దు
టీనేజ్ లేదా యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్లు మేకప్ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఎక్కువగా వాడకూడదు. మొటిమలపై మేకప్ వేసుకోవడం ద్వారా చర్మంపై కెమికల్ రియాక్షన్స్ మరింత ఎక్కువవుతాయి.
కలబందతో..
మొటిమలు తొలగించడంలో కలబంద మంచిగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుని ముఖానికి పట్టించడం లేదా మొటిమలు ఉన్నచోట రాయడం ద్వారా మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
గ్రీన్ టీ
రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల స్కిన్ హెల్త్ మెరుగుపడుతుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మంపై మచ్చలు తగ్గుతాయి. అలాగే గ్రీన్ టీ బ్యాగ్స్‌ను మొటిమలపై ప్యాక్ లా కూడా వాడుకోవచ్చు.
ఫుడ్ ఇలా..
యంగ్ ఏజ్‌లో మొటిమలు వస్తున్నవాళ్లు నూనె పదార్థాలను తగ్గించి విటమిన్–ఎ ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఆకుకూరలు, నట్స్ వంటివి ఎక్కువగా తింటే మొటిమల సమస్య తగ్గుతుంది.