ఇన్‌స్టాగ్రామ్ కోసం ఇంట్రెస్టింగ్ రీల్స్ ఐడియాస్!

రీచ్ ఉండాలంటే..
చాలామంది యూత్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారి రీల్స్ చేస్తుంటారు. అయితే రీల్స్‌తో మంచి రీచ్ సాధించాలంటే కంటెంట్ కొత్తగా ఉండాలి. రీల్స్ కోసం కొన్ని ఇంట్రెస్టింట్ ఐడియాస్ మీ కోసం.
డైలీ లైఫ్
కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే టైం మీకు లేకపోతే.. మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో ఇంట్రెస్టింగా అనిపించే వాటినే రీల్స్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. ఇలాంటి రీల్స్‌కు మినిమం రీచ్ ఉంటుంది.
హౌ టు వీడియోస్
‘హౌ టు’ వీడియోస్‌కు ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది. చాలామందికి తెలియని కొత్త విషయాలను ఎలా చేయాలో వివరిస్తూ ఈ వీడియోలు చేయాలి.
ట్రావెల్ వీడియోలు
ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రావెల్ రీల్స్‌కు మంచి రీచ్ ఉంటుంది. కొత్త ప్రదేశాలే కాకుండా మీ రోజువారీ జర్నీలను కూడా క్రియేటివ్‌గా ఎడిట్ చేసి రీల్స్‌గా అప్‌లోడ్ చేయొచ్చు.
ఆస్క్ మీ
మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్లతో ఎంగేజ్ అయ్యేందుకు ‘ఆస్క్ మీ ఎనీ థింగ్’ రీల్స్ పనికొస్తాయి. మిమ్మల్ని ఏదైనా అడగమంటూ ఒక పోస్ట్ పెట్టి.. కామెంట్స్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ రీల్స్ అప్‌లోడ్ చేయొచ్చు.
ఫన్నీ కామెంట్రీ
పాపులర్ మీమ్స్, క్రికెట్ లేదా మూవీ లోని సీన్స్.. ఇలా ట్రెండ్ అవుతున్న వాటికి మీ కామెంట్రీ యాడ్ చేసి కొత్తగా రీల్ చేయొచ్చు.
ఇన్ఫర్మేటివ్
ఇక వీటితోపాటు మీకు నచ్చిన టాపిక్ ఎంచుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను అందిస్తూ రీల్స్ చేయొచ్చు.