పిగ్మెంటేషన్‌ మచ్చలు పోవాలంటే

కారణాలివే
హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా ఇతర కారణాల వల్ల చర్మంలో మెలనిన్ తగ్గితే పిగ్మెంటేషన్ మచ్చలు వస్తాయి. వీటినే మంగుమచ్చలు అని కూడా అంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో వీటిని పోగొట్టొచ్చు. అదెలాగంటే..
టొమాటోతో
టొమాటో గుజ్జుకి కొద్దిగా తేనె, పాలు కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది. వీటిలో ఉండే లైకోపిన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ మచ్చలను పోగొడతాయి.
ఆలూతో
బంగాళాదుంపల నుంచి రసం తీసి దాన్ని ముఖానికి పట్టిస్తే పిగ్మెంటేషన్ మచ్చలు తగ్గుతాయి. బంగాళాదుంపల్లో ఉండే విటమిన్–సి, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రిపేర్ చేస్తాయి.
ఉల్లి రసంతో
ఉల్లి రసానికి కూడా పిగ్మెంటేషన్ ను తగ్గించే గుణం ఉంది. ఉల్లి రసాన్ని పిగ్మెంటేషన్ మచ్చలపై రాసి కాసేపటి తర్వాత కడిగేస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి.
కలబందతో
కలబంద ఎటువంటి చర్మసమస్యలనైనా తగ్గించగలదు. కలబంద గుజ్జును పిగ్మెంటేషన్ మచ్చలపై రాసి ఆరిన తర్వాత కడిగేస్తే కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
పసుపు
పసుపు, చందనం, రోజ్ వాటర్‌‌తో కలిపిన మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఇందులో పచ్చిపాలు కూడా కలుపుకోవచ్చు.
ఇవి కూడా
పోషకాహార లోపం, ఎండలో ఎక్కువ తిరగడం, పొల్యూషన్, మేకప్ ప్రొడక్స్ వల్ల కూడా ఈ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తపడాలి.