వర్క్‌ప్లేస్‌లో లీడర్‌‌గా ఎదగాలంటే

లీడర్‌‌షిప్ స్కిల్స్
ప్రొఫెషనల్ లైఫ్‌లో.. లీడర్‌‌గా ఎదగాలంటే దానికి కొన్ని బేసిక్ స్కిల్స్ ఉండాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ లీడర్స్‌కు కామన్‌గా ఉన్న స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్లియర్ కమ్యూనికేషన్
లీడర్ అనేవాడు ఎప్పడూ విషయాన్ని స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలగాలి. తన కింద పనిచేసే వారికి స్పష్టమైన సంకేతాలు, గైడెన్స్ ఇవ్వగలిగితేనే లీడర్‌కు వాల్యూ ఉంటుంది.
పాజిటివ్ యాటిట్యూడ్
లీడర్ ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ప్రతి సమస్యను ఛాలెంజ్‌గా తీసుకుంటూ సాల్వ్ చేయగలమన్న నమ్మకంతో ముందుకెళ్లాలి. అప్పుడే ప్రకృతి కూడా తనకు సహకరిస్తుంది.
టీంపై నమ్మకం
లీడర్‌‌కు తన టీమ్‌పై ఎప్పుడూ నమ్మకం ఉండాలి. టీమ్‌ను సరిగ్గా అంచనా వేయగలిగినప్పుడే వారిని గైడ్ చేయగల సామర్థ్యం వస్తుంది.
ఫ్లెక్సిబిలిటీ
పరిస్థితులు ఎలా ఉన్నా దానికి అనుగుణంగా పని చేస్తూ రిజల్ట్స్ రాబడుతూ ఉండాలి. ప్రతి సందర్భంలోనూ ఫ్లెక్సిబుల్‌గా ఉంటూ అడాప్టిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి.
ఎమోషనల్ కోషెంట్
లీడర్ రోబోలా బిహేవ్ చేయకూడదు. మనుషుల పట్ల ప్రేమ, నమ్మకం, నిజాయితీ వంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎమోషనల్‌గా ఉంటూనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నప్పుడు గొప్ప లీడర్‌‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.
క్విక్ డెసిషన్స్
డెసిషన్ మేకింగ్ అనేది లీడర్‌‌కు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ. అయితే ఎవరైతే సరైన డెసిషన్‌ను త్వరితగతిన తీసుకోగలరో వాళ్లు మరింత సమర్థవంతమైన లీడర్స్‌గా ఎదగగలరు.