మిగతా సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలం గాలిలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా వంటి క్రిములు ఆహారం ద్వారా పొట్టలోకి చేరతాయి. అందుకే ఈ సీజన్‌లో గట్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి.
అల్లం
పొట్టలో జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడానికి అల్లం బాగా పనికొస్తుంది. మాన్‌సూన్‌లో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.
పెరుగు
వర్షాకాలంలో ఫుడ్ ద్వారా పొట్టలోకి చేరే చెడు బ్యాక్టీరియాను చంపేందుకు పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉండాలి. అందుకే ఈ సీజన్‌లో పెరుగు తప్పక తినాలి.
ఆకుకూరలు
వర్షాకాలంలో డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇతి అత్యంత తేలిగ్గా, త్వరగా జీర్ణమవుతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి నేచురల్ యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించానికి, ఇమ్యూనిటీ పెంచడానికి వెల్లుల్లిని రోజూ తీసుకోవాలి.
అరటి
అరటిపండ్లలో ఉండే హై ఫైబర్.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగుల్లో మూవ్‌మెంట్ సరిగ్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, అరటిపండ్లు పేగుల్లో గట్ బ్యాక్టీరియాను కూడా పెంచుతాయి.
బొప్పాయి
వర్షాకాలంలో బొప్పాయి పండ్లు తినడం ద్వారా జ్వరాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారిస్తాయి.