రోజులో మూడు నాలుగు లీటర్ల నీటిని తాగాలని మనకు తెలుసు. అయితే అసలు నీటిని ఏయే సమయాల్లో తాగాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే
నీళ్లు తాగడానికి ఉదయం సరైన సమయం. లేవగానే కనీసం లీటర్ నీళ్లైనా తాగితే మంచిది. ఉదయాన్నే తాగే నీళ్ల వల్ల శరీరంలోని ప్రతీ కణానికి నీళ్లు అందుతాయి.
బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు
ఉదయం టిఫిన్ చేయడానికి అరగంట ముందు మళ్లీ అర లీటర్ నీటిని తాగడం మంచిది. ముందే తాగేస్తే తిన్న తర్వాత తాగాల్సిన పని ఉండదు.
లంచ్‌కు ముందు
లంచ్‌కు అరగంట లేదా గంట ముందు మరొక అరలీటర్ వాటర్ తాగడం మంచిది. భోజనానికి ముందే నీళ్లు తాగడం వల్ల పొట్ట క్లీన్ అయ్యి ఆహారం గ్రహించడానికి రెడీగా ఉంటుంది.
తిన్న తర్వాత
ఇక తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. లంచ్ తర్వాత కనీసం గంటన్నర తర్వాత మాత్రమే మళ్లీ అరలీటరు నీళ్లు తాగాలి. ఇలా చేస్తే జీర్ణ సమస్యలు ఉండవు.
డిన్నర్‌కు ముందు
ఇక సాయంత్రం వేళల్లో అలాగే మళ్లీ డిన్నర్‌కు అరగంట ముందు మరొక అర లీటరు నీళ్లు తాగొచ్చు. అలాగే రాత్రి పడుకోవడానికి గంట ముందే నీళ్లు తాగేలా చూసుకోవాలి.
ఇది ముఖ్యం
తినడానికి అరగంట ముందు, తిన్న గంట తర్వాత నీళ్లు తాగడం రూల్‌గా పెట్టుకోవాలి. అలాగే తాగేటప్పుడు కనీసం అరలీటరైనా తాగాలి. ఈ రూల్‌తో పాటు మధ్యలో దాహం వేస్తే కూడా గ్లాసు చొప్పన నీళ్లు తాగొచ్చు.