మందు మానలేకపోతున్నారా? ఈ స్టెప్స్ ఫాలో కండి!

చాలా డేంజర్
లివర్ ఫెయిల్యూర్ నుంచి గుండె పోటు వరకూ రకరకాల ప్రమాదాలకు ఆల్కహాల్ కారణమవుతోంది. అయితే ఈ అలవాటుని మానేయాలి అనుకున్నా మానలేకపోతారు చాలామంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..
తగ్గిస్తూ పోవాలి
మందు మానేయాలనుకున్న వాళ్లు ఒకేసారి మానలేకపోతే మెల్లగా తగ్గిస్తూ పోవాలి. డైలీ తాగేవాళ్లు వారానికోసారి ఆ తర్వాత నెలకోసారి.. ఇలా నెమ్మదిగా మానే ప్రయత్నం చేయాలి.
కొత్త అలవాటుతో..
రోజూ తాగే అలవాటున్నవాళ్లు ఆ టైంలో ఏదైనా కొత్త అలవాటుని మొదలుపెడితే మందు మీదకు మనసు పీకదు. ఏదైనా నేర్చుకోవడం, వ్యాయామం లేదా గేమ్స్ ఆడడం వంటివి చేయొచ్చు.
ఆల్కహాల్ ఫ్రీ
ఉన్నట్టుండి మందు మానలేని వాళ్లు కొంత కాలం జీరో ఆల్కహాల్ డ్రింక్స్ వంటివి తీసుకోవచ్చు. వీటి ద్వారా తాగిన ఫీల్ ఉంటుంది. ఆరోగ్యం కూడా పాడవ్వదు.
సమస్యలు వస్తే..
మందుకి బాగా బానిస అయినవాళ్లు ఉన్నట్టుండి మందు మానేస్తే తలనొప్పి, వణుకు వంటివి వస్తాయి. ఇలాంటి వాళ్లు డాక్టర్‌‌ను కలిసి తగిన సలహా తీసుకోవాలి.
హెర్బల్ టీలు
ఆల్కహాల్ మానేసిన వాళ్లు హెర్బల్ టీలు అలవాటు చేసుకోవడం ద్వారా లివర్ డీటాక్స్ చేసుకోవచ్చు. అలాగే అవి కొంత రీఫ్రెష్‌మెంట్‌ను కూడా ఇస్తాయి.
డాక్టర్ల సాయం
ఎంత ట్రై చేసినా మందు మానేయలేకపోతున్నవాళ్లు, మందుకి విపరీతంగా బానిస అయిన వాళ్లు సైక్రియాటిస్ట్‌ను కలిసి రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ వంటివి తీసుకోవచ్చు.