బ్యాక్ పెయిన్ తగ్గేందుకు ఇలా చేయొచ్చు!

కామన్ ప్రాబ్లమ్
ప్రస్తుతం ఉన్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలామందికి యంగ్ ఏజ్‌లోనే బ్యాక్ పెయిన్ మొదలవుతుంది. అయితే నొప్పి ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. అదెలాగంటే..
హాట్ లేదా కోల్డ్
ఓవరాల్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఒకవేళ నొప్పి ఒకేచోట తీవ్రంగా ఉంటే అప్పుడు ఐస్ ప్యాక్ వేసుకోవాలి.
మసాజ్
కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్నచోట మర్ధన చేసుకుంటే నొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కొబ్బరి లేదా నువ్వుల నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి, వాపుని తగ్గిస్తాయి.
స్ట్రెచింగ్
బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు నిపుణులు సూచించిన కొన్ని తేలికపాటి బ్యాక్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా వెన్నెముకపై పడే ఒత్తిడిని తగ్గించొచ్చు. తద్వారా కొన్ని రోజుల్లోనే బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు.
అల్లం
వెన్నునొప్పి ఉన్నవాళ్లు రోజూ అల్లంటీ తాగితే కొంత రిలీఫ్ ఉంటుంది. నొప్పులను తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.
పసుపు పాలు
పసుపులో ఉండే కుర్‌‌కుమిన్ అనే పదార్థం ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే పాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. కాబట్టి నొప్పులు ఉన్నవాళ్లు రోజూ పసుపు కలిపిన పాలు తాగితే నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు.
తీవ్రంగా ఉంటే..
వెన్నునొప్పి తీవ్రంగా ఉన్నా, ఎక్కువరోజుల పాటు వేధిస్తున్నా.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌‌ను కలవాలి. మెడిసిన్స్‌ వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.