జుట్టు రాలడాన్ని అరికట్టాలంటే ఈ ఆహారపదార్థాలు తీసుకోండి
చిలగడదుంపలు
చిలగడదుంపలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది జట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది
సాల్మన్
సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. మెరిసేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు పొడిబారకుండా ఎండిపోయి గడ్డిలా మారకుండా చూస్తాయి.
ఎగ్స్
ఎగ్స్ లో ప్రోటీన్స్, బయోటిన్, విటమిన్ డి ఉంటాయి. కెరాటిన్ ఉత్పత్తికి ప్రోటీన్స్ చాలా అవసరం. మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం, పలుచబడడం వంటి సమస్యలు తగ్గుతాయి.
బెర్రీస్
బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
పెరుగు
పెరుగులో ఉండే విటమిన్ డి, కాల్షియం హెయిర్ ఫొలికల్స్ స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి
బాదం
బాదంలో పీచు, మాంసకృత్తులతో పాటు మాంగనీస్, సెలీనియం వంటి మూలకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టును మెరిపించడంతో పాటు బలంగా మారుస్తాయి.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పొడి జుట్టు, సన్నని జుట్టు, రంగు మారిన జుట్టు ఉన్నవారికి ఇది ఉత్తమమైనది. ఇది జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
క్యారెట్
క్యారెట్ తీసుకోవడం కంటి ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.