పొల్యూషన్ ఎఫెక్ట్‌ను తగ్గించే ఫుడ్స్ ఇవే!

పెద్ద ప్రాబ్లమ్
ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. దీన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో లేకపోయినప్పటికీ ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
డైట్ ఇలా
కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవాళ్లు డైట్ పరంగా కొన్ని మార్పులు చేసుకుంటే పొల్యూషన్ వల్ల ఏర్పడే సమస్యలను కొంత వరకూ తగ్గించుకోవచ్చు.
విటమిన్–సి
పొల్యూషన్‌లో ఎక్కువగా గడిపేవాళ్లు రోజువారీ ఆహారంలో విటమిన్–సి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి టాక్సిన్స్‌ను క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
బెర్రీస్
బెర్రీ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా పొల్యూషన్ ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. బెర్రీల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోకి చేరే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేస్తాయి.
బ్రోకలీ
బ్రోకలీ కూడా పొల్యూషన్‌ ఎఫెక్ట్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ అనే కాంపౌండ్.. శరీరంలో చేరే హానికరమైన కెమికల్స్‌ను తొలగించడంలో సాయపడుతుంది.
పసుపు
నేచురల్ యాంటీ బయాటిక్‌గా చెప్పుకునే పసుపుని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పొల్యూషన్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని కణాలను రిపేర్ చేస్తాయి.
నీళ్లు
పొల్యూషన్‌లో ఎక్కువగా ఉండేవాళ్లు తగినంత నీళ్లు తాగుతుండడం చాలా అవసరం. నీళ్లు ఎక్కువగా తాగితే ఆటోమెటిక్‌గా శరీరంలోని టాక్సిన్స్ ఫిల్టర్ అవుతుంటాయి.