రాత్రిపూట ఆహారం ఎంత లైట్‌గా తీసుకుంటే అంత మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. అలాగే రాత్రిళ్లు అస్సలు తినకూడని ఫుడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
స్పైసీ ఫుడ్స్
రాత్రిపూట కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలొస్తాయి. నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది.
ఫ్రైడ్ ఫుడ్స్
రాత్రిళ్లు పడుకునేముందు ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. అంతేకాదు ఈ అలవాటు బరువు పెరగడానికి కూడా దారి తీస్తుంది.
నాన్‌వెజ్
నాన్‌వెజ్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి నాన్‌వెజ్ పగటిపూట తింటేనే మంచిది. రాత్రిళ్లు నాన్‌వెజ్ తింటే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. నిద్ర డిస్టర్బ్ అవుతుంది.
స్వీట్స్
నిద్రకు ముందు స్వీట్స్, షుగర్స్ వంటివి తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు బరువు పెరగడానికి కూడా ఇది కారణం అవుతుంది.
కాఫీ
రాత్రిళ్లు కాఫీ తాగితే నిద్ర సరిగా పట్టకపోగా రానురాను ఈ అలవాటు క్రమంగా నిద్రలేమికి దారి తీస్తుంది.
సిట్రస్ ఫ్రూట్స్
నిద్రకు ముందు సిట్రస్ ఫ్రూట్స్ తింటే పొట్టలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది బ్లోటింగ్, కడుపులో మంట వంటి సమస్యలకు దారి తీస్తుంది.