బరువు తగ్గడానికి రకరకాల డైట్‌లు పాటిస్తుంటారు చాలామంది. అయితే వీటితోపాటు రోజూ కొన్ని ఫ్లేవర్డ్ వాటర్స్ తాగడం ద్వారా ఇంకా త్వరగా బరువు తగ్గొచ్చంటున్నారు న్యూట్రిషనిస్టులు.
డీటాక్స్ డ్రింక్స్
యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే కాయగూరలు, పదార్ధాలతో చేసే కొన్ని డీటాక్స్ డ్రింక్స్ తాగడం ద్వారా మెటబాలిజం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు. అలాంటి కొన్ని బెస్ట్ డ్రింక్స్ ఇప్పుడు చూద్దాం.
అల్లం, నిమ్మరసం
ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకుని అందులో నిమ్మకాయను పిండి అందులో కొద్దిగా అల్లం, పుదీనా, పింక్ సాల్ట్ వేసి కలపాలి. రోజుకోసారి ఈ నీళ్లు తాగితే మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు.
కీరా, పుదీనా
కీరదోస, నిమ్మకాయను ముక్కలుగా కోసి ఒక గ్లాస్ నీళ్లలో ఇవి వేయాలి. తర్వాత అందులో కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు.
తులసితో...
ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులను వేసి రాత్రంగా పక్కనపెట్టాలి. ఉదయాన్నే అందులో కొద్దిగా నిమ్మరసం పిండి తాగితే శరీరం డీటాక్స్ అవుతుంది.
సోంపుతో
ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో సోంపు వేసి నాలుగైదు గంటలు నాననివ్వాలి. తర్వాత అందులో ఆరెంజ్ జ్యూస్ లేదా ఆపిల్ జ్యూస్ వంటివి కలుపుకుని తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈజీగా బరువు తగ్గొచ్చు.
వెజిటబుల్ డ్రింక్
ఒక గ్లాసులో కీరదోస ముక్కలు, సొరకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వంటివి వేసి నాలుగైదు గంటలు పక్కన పెట్టాలి. ఇందులో నిమ్మరసం, అల్లం కలుపుకుని తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు.