సమ్మర్‌లో శక్తినిచ్చే సత్తు డ్రింక్ గురించి తెలుసా?
సత్తు షర్బత్
వేసవిలో శరీరానికి హైడ్రేషన్ ముఖ్యం. అందుకే ఈ సీజన్‌లో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే సమ్మర్‌లో శరీరానికి శక్తినిచ్చే డ్రింక్స్‌లో సత్తు షర్బత్ ముందుంటుంది. దీన్నెలా చెయాలంటే.
ప్రొటీన్ డ్రింక్
సత్తు డ్రింక్‌ను శనగపిండితో చేస్తారు. ఇది సమ్మర్‌లో హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాక శరీరానికి కావల్సిన ప్రొటీన్, మినరల్స్‌ను కూడా అందిస్తుంది.
ప్రాసెస్ ఇదీ
ఒక బౌల్ తీసుకుని అందులో దోరగా వేయించుకున్న స్పూన్ జీలకర్ర, కొద్దిగా మామిడి తురుముని వేసి అందులో తగినన్ని నీళ్లు పోసి శనగపిండి కలపాలి.
షర్బత్ రెడీ
ఈ డ్రింక్ లో రుచి కోసం పుదీనా, నిమ్మరసం, ఉప్పు వంటివి కలుపుకోవచ్చు లేదా పచ్చిమిర్చి తురుము కూడా కలుపుకోవచ్చు. అంతే సత్తు షర్బత్ రెడీ.
హెల్దీ డ్రింక్
ఈ డ్రింక్ సమ్మర్‌లో ఎంతో మేలు చేస్తుంది. పుదీనా, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పులో ఉండే మినరల్స్ శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే శనగపిండిలోని ప్రొటీన్ అలసటను తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఫ్రీ
సత్తు డ్రింక్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ డయాబెటిస్ ఉన్నవాళ్లకు కూడా మంచిదే.
కొవ్వు కరుగుతుంది
ఉదయాన్నే ఈ సత్తు షరబత్ తాగడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. అంతేకాదు పొట్ట క్లీన్ అవ్వడానికి, మెటబాలిజం పెరగడానికి కూడా ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుంది.