చేదుగా ఉన్నా బోలెడు బెనిఫిట్స్!

చేదుతో ఆరోగ్యం
ఆరోగ్యానికి రుచితో సంబంధం లేదు. ముఖ్యంగా చేదుగా ఉండే కొన్ని పదార్థాలు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చేదు అని తీసిపారేస్తే వాటితో ఉండే బెనిఫిట్స్‌ను మిస్ అయినట్టే. అలాంటి కొన్ని బెస్ట్ బిట్టర్ ఫుడ్స్ ఇప్పుడు చూద్దాం.
కలబంద
చేదుగా ఉండే కలబంద సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. జీర్ణ సమస్యల నుంచి చర్మ సౌందర్యం వరకూ దీంతో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ అన్నీ ప్యాక్ చేయబడి ఉంటాయి.
పసుపు
పసుపు కూడా చేదుగానే ఉంటుంది. కానీ, శరీరానికి ఇది చేసే మేలు మనకు తెలిసిందే. శరీరంలోని చెడు బ్యాక్టీరియాను పోగొట్టడానికి, ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవడానికి పసుపు తీసుకోవడం ఎంతైనా అవసరం.
వేప
చేదుగా ఉండే వేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్.. శరీరాన్ని పూర్తిగా డీటాక్స్ చేస్తాయి. పొట్ట ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి వేప చాలా మంచిది.
కాకరగాయ
కాకరగాయ రుచి చేదైనా దాని గుణాలు మాత్రం అమృతంతో సమానం. ఇది షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, డైజెషన్ సరిగా జరగడానికి ఎంతో మేలు చేస్తుంది.
మెంతులు
చేదుగా ఉండే మెంతులు షుగర్‌‌ సమస్యకు విరుగుడుగా పనిచేస్తాయి. రోజూ మెంతులను ఆహారంలో కలిపి తీసుకున్నా లేదా మెంతులు నానబెట్టిన నీళ్లు తాగినా.. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
కోకోవా
చేదుగా ఉండే కోకో గింజలతోనే చాక్లెట్ చేస్తారు. దీని రుచి చేదైనా ఫ్లేవర్ మాత్రం అద్భుతం. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌తో గుండె ఆరోగ్యం సేఫ్‌గా ఉండడమే కాక, రక్త ప్రసరణ  మెరుగుపడుతుంది.