ముఖంపై మొటిమలతోపాటు చాలామంది తెల్లటి పొక్కులు కూడా వస్తుంటాయి. వీటికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ వీటిని తొలగించుకోవడం మాత్రం సులభమే. దానికై ఏమేం చేయొచ్చంటే..
టొమాటోతో..
టొమాటోలో ఉండే విటమిన్–సి పొక్కులను నయం చేస్తుంది. టొమాటోను రెండు ముక్కలుగా కట్ చేసి ముఖంపై రుద్దాలి. తడి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా రోజుకోసారి చేస్తే చాలు.
పెరుగుతో..
పెరుగులోని ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కొద్దిగా ఓట్స్ పౌడర్ వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వైట్‌హెడ్స్ తగ్గుతాయి.
ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టి చర్మాన్ని తేమగా ఉంచడంతోపాటు, వైట్‌హెడ్స్‌ను కూడా తొలగిస్తుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.
అలొవెరా
కలబంద గుజ్జులో కొద్దిగా తెనె కలిపి వైట్‌హెడ్స్‌పై రాసుకుంటే పొక్కులు త్వరగా తగ్గుతాయి. కలబంద, తెనెలో ఉన్న యాంటీబయాటిక్ గుణాలు చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి.
ఫేస్ వాష్
ముఖంపై వైట్‌హెడ్స్ రాకూడదంటే ఎప్పటికప్పుడు ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకి మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం ముఖ్యం.
హైడ్రేషన్
వైట్ హెడ్స్ రాకుండా ఉండాలంటే ఎండలో బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకుంటుండాలి. రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని తాగాలి.