ఏ రోగమైనా పుట్టేది ప్రేగులోనే అని డాక్టర్లు చెప్తుంటారు. అంతేకాదు గట్(ప్రేగు) ను సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఇది మెదడులోని ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే గట్ ఆరోగ్యంగా ఉంటే పూర్తి హెల్దీగా ఉండొచ్చు.
ఫైబర్స్
గట్ ఆరోగ్యంగా ఉండాలంటే తేలిగ్గా అరిగే పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, ట్రాన్స్‌ఫ్యాట్స్‌ను తగ్గించాలి. అప్పుడే ప్రేగుల్లో మూవ్‌మెంట్ సరిగ్గా ఉంటుంది.
హైడ్రేషన్
ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ తగినంత నీరు తాగాలి. శరీరంలో నీరు తగ్గితే డీహైడ్రేషన్ వల్ల మలబద్దకం వస్తుంది. ప్రేగు ఆరోగ్యం దెబ్బ తింటుంది.
ప్రొబయాటిక్
గట్ ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగు, ఇడ్లీ వంటి ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకుంటుండాలి. వీటిలో ఉండే మంచి బ్యాక్టీరియా ప్రేగుల్లోని చెడు బ్యా్క్టీరియాను నశింపజేస్తుంది.
బెర్రీలు
గట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు బెర్రీ పండ్లు తినడం ద్వారా గట్ హెల్త్ ను రీస్టోర్ చేసుకోవచ్చు. బెర్రీ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్, ఫైబర్, నేచురల్ కాంపౌండ్స్ పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
రెండు సార్లు
గట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు గట్ ను క్లీన్ చేస్తుండాలి. దీనికోసం రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మల విసర్జన చేయాలి. లేకపోతే మల బద్ధకం సమస్య పెరుగుతుంది.
ఇవి తినాలి
గట్ హెల్త్ పాడవ్వకుండా ఉండాలంటే పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇవి జీర్ణ వ్యవస్థ పని తీరుని మెరుగుపరచి గట్ హెల్త్ పాడవ్వకుండా కాపాడతాయి.