వర్షాకాలం ఈ ఫుడ్స్‌తో జాగ్రత్త!

ఫుడ్ పాయిజనింగ్ రిస్క్
వర్షాకాలంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సీజన్‌లో కొన్ని ఫుడ్స్ ఈజీగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ పట్ల జాగ్రత్త వహించాలి.
క్యాబేజీ
పొరలు పొరలుగా ఉండే క్యాబేజీని ఈ సీజన్‌ను చెక్ చేసి తీసుకోవాలి. క్యాబేజీ పొరల్లో కాస్త తేమ నిల్వ ఉన్నా.. వెంటనే క్రిములు, పురుగులు వచ్చి చేరే అవకాశం ఉంటుంది.
మష్రూమ్స్
వర్షాకాలం మష్రూమ్స్ విషయంలోకూడా జాగ్రత్త వహించాలి. ఈ సీజన్‌లో వీటిపై ఎక్కువ క్రిములు చేరే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకూ వీటిని బాగా ఉడికించి లేదా ఉప్పు కలిపిన వేడి నీటిలో కడిగి వండుకుంటే మంచిది.
వంకాయ
వంకాయ కూడా వర్షకాలంలో త్వరగా పాడవుతుంది. ఈ సీజన్‌లో వంకాయలు వండుకునేటప్పుడు లోపల పురుగు పట్టిందేమో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మంచిది.
ఆల్కహాల్
వర్షాకాలంలో ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల రిస్క్ పెరుగుతుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరగడానికి ఆల్కహాల్ కారణమవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో దాన్ని మానుకుంటే మంచిది.
స్ట్రీట్ ఫుడ్
వర్షాకాలంలో బయటి ఫుడ్ తినకపోవడమే చాలా మంచిది. ఈ సీజన్‌లో శుభ్రతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో శుభ్రత ఏ మేరకు ఉంటుందో తెలియదు. కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్.
క్లీనింగ్ ఇలా..
ఈ సీజన్‌లో ఆకు కూరలు, కూరగాయలపై కూడా క్రిములు పేరుకుంటాయి. భూమిలో పండే దుంపలు కూడా త్వరగా పాడవుతాయి. కాబట్టి కూరగాయలన్నింటినీ ఉప్పు కలిపిన వేడి నీటిలో శుభ్రంగా కడగిన తర్వాతే వండుకోవాలి.