మొటిమలను తగ్గించే ఫుడ్స్ ఇవీ!

మచ్చల్లేని చర్మం కోసం..
ముఖంపై మొటిమలు, మచ్చలు పోగొట్టడం కోసం పైపైన క్రీములు వాడడం కంటే లోపలి నుంచి పోషణ అందించడం ముఖ్యం. దీనికోసం చర్మానికి కావాల్సిన పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
విటమిన్–సీ
చర్మ ఆరోగ్యానికి విటమిన్–సీ చాలా అవసరం. కాబట్టి మచ్చలు లేని చర్మం కోసం ‘సీ’ విటమిన్ ఉండే టొమాటో, జామ, నిమ్మ, బత్తాయి వంటివి తీసుకోవాలి. డైట్‌లో వీటిని తీసుకుంటే చర్మం ట్యాన్ అవ్వకుండా, ముడతలు పడకుండా చూసుకోవచ్చు.
డార్క్‌ చాక్లెట్‌
డార్క్ చాక్లెట్‌లో ఉండే పాలీఫినాల్స్‌, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. మచ్చలు పోగొట్టి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
అల్లం
చర్మలో మృతకణాలను తొలగించి డీటాక్స్ చేయడంలో అల్లం సాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
దాల్చినచెక్క
జిడ్డు చర్మం ఉన్నవారికి దాల్చిన చెక్క మేలు చేస్తుంది. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. తద్వారా మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది.
ఆవకాడో
ఆవకాడోలో ఉండే మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. తరచూ ఆవకాడో తినడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. పొడిచర్మం, ముడతలు వంటి సమస్యలు తగ్గుతాయి.
ఫ్లాక్స్ సీడ్స్
చర్మ ఆరోగ్యానికి కావాల్సిన ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ ఫ్లాక్స్ సీడ్స్ తినడం ద్వారా చర్మం తాజాగా, మృదువుగా ఉంటుంది.