సమ్మర్ వెకేషన్‌లో భాగంగా అడ్వెంచర్ టూర్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మనదేశంలో దానికి బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా!
పారాగ్లైడింగ్
హిమాచల్‌ప్రదేశ్ లోని మనాలి, బిర్ బిల్లింగ్ ప్రాంతాల్లో పారాగ్లైడింగ్ వంటి అడ్వెంచర్స్ చేసేందుకు ఇదే సరైన సీజన్. హిమాచల్ ప్రదేశ్‌లో సమ్మర్‌లో కూడా చల్లని వాతావరణం ఉంటుంది.
కొండలపై క్యాపింగ్
కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్న వెస్టర్న్ ఘాట్స్‌లో క్యాంపింగ్ చేసేందుకు ఈ సీజన్ అనుకూలంగా ఉంటుంది. మడికేరి, చిక్‌మగళూర్, మున్నార్ వంటి హిల్ స్టేషన్స్‌లో నైట్ క్యాపింగ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు.
నీలగిరి ట్రెక్కింగ్
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఉండే నీలగిరి మౌంటెన్స్‌లో ట్రెక్కింగ్ చేసేందుకు సమ్మర్ అనువుగా ఉంటుంది. ఈ మౌంటెన్ రేంజ్‌లో మిస్ట్ వ్యాలీ ట్రెక్, టోడా విలేజ్ ట్రెక్, టైగర్ హిల్ ట్రెక్, రైల్ ట్రయల్ వంటివి ఫేమస్.
కాశ్మీర్ లోయలు
ఈ సీజన్‌లో కాశ్మీర్‌లోని మంచు మైదానాలన్ని పచ్చగా మారతాయి. సోన్‌మార్గ్, గుల్మార్గ్ వంటి ప్రాంతాల్లో విహరించడానికి, లేక్స్‌కు ట్రెక్ చేయడానికి ఇది అనువైన సమయం.
యమ్‌తాంగ్ వ్యాలీ
ఎప్పుడూ మంచుతో నిండి ఉండే సిక్కింలోని యమ్‌తాంగ్ వ్యాలీ.. సమ్మర్ సీజన్‌లో పూల మైదానంలా మారుతుంది. ఈ అందమైన పూల లోయను చూసేందుకు ఇదే సరైన సమయం.
స్క్యూబా డైవింగ్
లక్షద్వీప్, అండమాన్ వంటి ఐలాండ్స్‌లో సర్ఫింగ్, స్క్యూబా డైవింగ్ వంటి అడ్వెంచర్స్ చేయడానికి కూడా సమ్మర్ సీజనే అనువుగా ఉంటుంది.